ఘన స్వాగతం: బెంగుళూరుకు కోహ్లీ సేన (ఫోటోలు)
హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా చివరిదైన మూడో టీ20 ఆడేందుకు భారత్, ఇంగ్లాండ్ జట్లు బుధవారం బెంగుళూరుకు చేరుకున్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమానంగా ఉన్నాయి. దీంతో సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే మూడో మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరగనుంది.
దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో ఇరు జట్లు సమరానికి సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బెంగళూరుకు చేరుకున్న తర్వాత భారత జట్టుకు హోటల్ వద్ద సిబ్బంది ఘనస్వాగతం పలికారు. తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

1-1తో సిరిస్ సమం
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా కాన్పూర్‌లో జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తే, నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన రెండో టీ20 చివరి ఓవర్‌లో టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది. దీంతో చివరిదైన మూడో టీ20 ఆసక్తికరంగా మారింది. మూడో టీ20లో విజయం సాధించి సిరిస్‌ను గెలుచుకోవాలని కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా తీవ్రంగా కృషి చేస్తోంది.

టీ20 సిరిస్‌ను గెలవాలనే పట్టుదలలో ఇంగ్లాండ్
టెస్టు, వన్డే సిరిస్ ఓటమి పరాభవాన్ని మరచిపోవాలంటే టీ20 సిరిస్‌ను గెలుచుకోవాలని ఇంగ్లాండ్ జట్టు ఆ దిశగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది. మరోవైపు ఇంగ్లాండ్‌తో చివరి టీ20 కెప్టెన్ కోహ్లీకి ఓ పరీక్షగానే క్రీడా విశ్లేషకులు అంటున్నారు. ధోని నుంచి కెప్టెన్సీ బాద్యతలను స్వీకరించిన తర్వాత ఏ ఫార్మాట్‌లోనైనా సొంత గడ్డపై కోహ్లి సిరీస్ కోల్పోలేదు. ఈ నేపథ్యంలో స్వదేశంలో సిరీస్‌లో ఓటమి అన్నదే లేని రికార్డును కోహ్లీ నిలబెట్టుకుంటాడా? లేదా చూడాలి.

చిన్నసామి స్టేడియంలో భారత్ రికార్డు 1-1
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరగ్గా, అందులో టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడింది. ఆ రెండు మ్యాచ్‌ల్లో భారత్ ఒక మ్యాచ్‌లో ఓటమి పాలుకాగా, మరొక మ్యాచ్‌లో విజయం సాధించింది. గతేడాది మార్చి 23వ తేదీన బంగ్లాతో భారత్ చివరిసారిగా టీ20 మ్యాచ్ ఆడింది.
ధోని నుంచి బ్యాటింగ్ టిప్స్
బుధవారం ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో టీ20 సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి బ్యాటింగ్ టిప్స్ అడిగి తెలుసుకుంటున్న సురేశ్ రైనా.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications