For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీయే కదా అనుకుంటే.. దుమ్ము దులిపాడు

 India vs England 3rd T20I: MS Dhonis bullet last-ball throw to dismiss Chris Jordan, watch video

హైదరాబాద్: యువ క్రికెటర్లకు ధీటుగా పరుగులు రాబడుతూ.. కీపింగ్‌లో మెరుపు వేగంతో వికెట్లు తీస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. వయస్సు అనేది కేవలం సంఖ్య మాత్రమే అనే రీతిలో దూసుకుపోతున్నాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు చెప్పి 50, 20 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడుతున్న ధోనీ వికెట్ల వెనుక ఉంటే బ్యాట్స్‌మన్ భయపడాల్సిందే.

జోర్దాన్‌కి నిరాశే ఎదురైంది.

జోర్దాన్‌కి నిరాశే ఎదురైంది.

అలాంటి ధోనీని బోల్తా కొట్టిస్తూ ఆఖరి బంతికి పరుగు తీయాలని ఆశించిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోర్దాన్‌కి నిరాశే ఎదురైంది. అతను క్రీజులోకి వచ్చేలోపే.. బెయిల్స్‌ అతనికి స్వాగతం పలికాయి. ఇప్పటికే టీ20ల్లో అత్యధిక స్టంపౌట్స్ చేసిన వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పిన ధోనీ.. ఈ మ్యాచ్‌లో ఐదు క్యాచ్‌లు పట్టి మొత్తంగా 50 క్యాచ్‌లు అందుకున్న ఏకైక వికెట్‌ కీపర్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ధోనీ చెప్పాడనే:

ధోనీ చెప్పాడనే:

ఇంగ్లాండ్‌తో ఆదివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ని యువ ఫాస్ట్ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ వేశాడు. ఆ ఓవర్‌లోని ఐదు బంతులు ముగిసేసరికి.. ఇంగ్లాండ్ 198/8తో నిలిచింది. దీంతో.. చివరి బంతికి ఎలాగైనా ఒక పరుగు తీసి.. భారత్‌ ముందు 200 పరుగుల టార్గెట్‌ను ఉంచాలని క్రీజులో ఉన్న ఆదిల్ రషీద్, జోర్దాన్ నిర్ణయించుకున్నారు. దీంతో.. షార్ట్‌పిచ్‌ రూపంలో బంతిని విసరాల్సిందిగా.. శార్ధూల్‌కి ధోనీ సూచించాడు.

ముందుగానే పసిగట్టిన ధోనీ..

ఈ సమయంలో నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జోర్దాన్.. ఒకవేళ బంతి బ్యాట్‌కి తగలకపోయినా.. పరుగు తీయాలని సైగల ద్వారా ఆదిల్ రషీద్‌కి తెలియజేశాడు. దీన్ని పసిగట్టిన ధోనీ.. ముందుగానే తన కుడిచేతి గ్లౌవ్‌ని తీసేసి రనౌట్‌కి సిద్ధమైపోయాడు. వ్యూహం ప్రకారం సిద్ధార్థ కౌల్ షార్ట్‌పిచ్ బంతిని విసరగా.. దాన్ని ఆదిల్ రషీద్ కనీసం టచ్‌ కూడా చేయలేకయాడు. అయినప్పటికీ.. పరుగు కోసం జోర్దాన్ ప్రయత్నించగా.. అప్పటికే బంతిని అందుకున్న ధోనీ మెరుపు వేగంతో బంతిని వికెట్లపైకి విసిరి రనౌట్ చేశాడు.

వరుసగా ఆరో టీ20 సిరీస్‌ విజయం.

వరుసగా ఆరో టీ20 సిరీస్‌ విజయం.

సిరీస్ విజేత నిర్ణయాత్మకమైన ఈ మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు.. ఓపెనర్‌ జేసన్ రాయ్ (67: 31 బంతుల్లో 4x4, 7x6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ (100 నాటౌట్: 56 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులు) అజేయ సెంచరీ బాదడంతో భారత్‌ 18.4 ఓవర్లలోనే 201/3తో అలవోక విజయాన్ని అందుకుంది. దీంతో.. మూడు టీ20ల సిరీస్‌‌ని భారత్ 2-1తో చేజిక్కించుకుంది. భారత్‌‌కి ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్‌ విజయం.

Story first published: Tuesday, July 17, 2018, 16:39 [IST]
Other articles published on Jul 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+