ఫోటోలు: రైనా కొట్టిన సిక్సు ఆరేళ్ల బాలుడి తొడపై పడింది
హైదరాబాద్: సిరిస్ విజేతగా నిలవాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. మూడో టీ20ల సిరిస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇప్పటికే టెస్టు, వన్డే సిరిస్‌లను సొంతం చేసుకున్నా టీ20 సిరిస్‌ను సొంతం చేసుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ టీమిండియా కెప్టెన్ కోహ్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
జట్టు స్కోరు నాలుగు పరుగుల వద్ద కెప్టెన్ కోహ్లీ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన సురేశ్ రైనా దూకుడిగా ఆడి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. మూడో ఓవర్ చివరి బంతికి బోణీ సిక్సర్ కొట్టిన రైనా, వికెట్లను వదిలి లెగ్‌సైడ్ వచ్చి లాఫ్టెడ్ షాట్‌తో బంతిని గాల్లో బౌండరీ దాటించాడు.

ఆరేళ్ల బాలుడికి తాకిన రైనా సిక్స్
రెండో సిక్స్‌తో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. అదే ఊపులో లాంగ్ లెగ్ మీదుగా మూడో సిక్స్ కొట్టాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా నాలుగో సిక్స్‌తో అర్థ సెంచరీ (41 బంతుల్లో 61 పరుగులు) పూర్తి చేశాడు. ఇలా ఐదు సిక్సులు కొట్టాడు. ఇలా సురేశ్ రైనా కొట్టిన ఐదు సిక్సర్లలో ఒక సిక్సు స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న ఆరేళ్ల బాలుడికి తాకింది.

కుర్రాడి ఎడమ తొడపై పడటంతో కొద్దిపాటి గాయం
సురేశ్ రైనా కొట్టిన బంతి వెళ్లి నేరుగా ఆ కుర్రాడి ఎడమ తొడపై పడింది. దాంతో అతడికి తొడమీద కొద్దిపాటి గాయమైంది. నొప్పితో విలవిల్లాడుతున్న ఆ పిల్లాడిని వెంటనే కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మెడికల్ సెంటర్‌కి తీసుకెళ్లి చికిత్సనందించి వైద్యులు డిశ్చార్జి చేశారు.

ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు
'సతీశ్‌కి స్వల్పగాయమైతే ప్రాథమిక చికిత్స అందించాం. ప్రాథమిక చికిత్స పూర్తయ్యాక తనని మళ్లీ మ్యాచ్ చూసేందుకు వెళ్లనివ్వాలని కోరడంతో సతీశ్ ని స్టేడియానికి పంపించాం' అని చికిత్స చేసిన డాక్టర్ మాథ్యా చాందీ పీటీఐతో అన్నాడు. 2012లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా ఓ బాలిక ముఖానికి ఇలాగే బంతి తగిలిన విషయం తెలిసిందే.

45 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 63 పరుగులు
కాగా, మూడో టీ20లో సురేశ్ రైనా 45 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. రైనా స్ట్రయిక్ రేట్ 140గా ఉంది. అంతేకాదు మూడో టీ20లో సురేశ్ రైనా ఓ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో పవర్ ప్లేలో మూడు సిక్సర్లు కొట్టిన రైనా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లలో రోహిత్ శర్మతో కలసి రెండో స్థానంలో నిలిచాడు.

టీ20ల్లో 7 ఏళ్ల తర్వాత అర్ధసెంచరీ చేసిన రైనా
గతంలో వీరేంద్ర సెహ్వాగ్ 2009లో న్యూజిలాండ్‌పై పవర్ ప్లేలో 4 సిక్సర్లు సాధించాడు. 2016లో వెస్టిండీస్‌పై రోహిత్ శర్మ 3 సిక్సర్లు కొట్టాడు. తాజాగా సురేశ్ రైనా ఈ ఘనతను సాధించాడు. మూడో టీ20లో రైనా నమోదు చేసిన అర్ధసెంచరీ 7 ఏళ్ల తర్వాత చేయడం విశేషం. చివరిసారిగా 2010లో టీ20 అర్ధసెంచరీ సాధించిన రైనా 38 ఇన్నింగ్స్‌ల తర్వాత మళ్లీ అర్ధ సెంచరీని సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications