హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో దూకుడుగా ఉంటాడు. అయితే ఈసారి కోహ్లీ తన దూకుడుని ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై ప్రదర్శించాడు. బెంగుళూరు వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో నాలుగు పరుగులకే కోహ్లీ రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు.
ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ వేసిన రెండో ఓవర్‌లో డిఫెన్స్ ఆడిన కోహ్లీ బంతి పిచ్‌ను కూడా దాటకముందే పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ కొంచెం ముందుకొచ్చి వెనుదిరగడంతో.. కోహ్లీ మళ్లీ క్రీజులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు.

ఈ సమయంలో బంతిని అందుకున్న జోర్డాన్ నేరుగా వికెట్లకు త్రో విసిరాడు. దీంతో నాలుగు బంతులను ఎదుర్కొన్న కోహ్లీ రెండు పరుగులకే వెనుదిరిగాడు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో షాక్‌కు గురైన కోహ్లీ రాహుల్‌ను తిట్టి పెవిలియన్‌కు చేరాడు. తాను అవుటయ్యేందుకు కేఎల్ రాహులే కారణమంటూ క్రీజులో నుంచే తిట్టేశాడు.
దీంతో రాహుల్ తీవ్రంగా బాధపడ్డాడు. మౌనంగా ఉండిపోయాడు. ఈ ఘటనతో మూడ్ ఆఫ్‌లోకి వెళ్లిన రాహుల్ ఆ తర్వాత కొద్ది సేపటికే 22 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్‌లో కోహ్లీ తీరుపై అభిమానులు మండిపడుతున్నారు. ఈ ఘటనలో ముమ్మాటికీ తప్పంతా కోహ్లీదేనని రాహుల్‌కు మద్దతుగా నిలిచారు.