Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కీలకపోరుగా మూడో వన్డే: విజయం ఎవరిని వరిస్తుందో?

India Vs England 3rd ODI : Match Preview
India vs England 3rd ODI Preview: India eye series win in the decider

హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో వన్డే లీడ్స్ వేదికగా మంగళవారం జరగనుంది. ఇరు జట్లు తలో మ్యాచ్‌ గెలవడంతో సిరిస్ 1-1తో సమం అయింది. దీంతో సిరిస్ విజేతను నిర్ణయించే మూడో వన్డే నిర్ణయాత్మంగా మారింది. ఈ వన్డేలో విజయం సాధించిన జట్టు మూడు వన్డేల సిరిస్‌ను కైవసం చేసుకుంటుంది.

తొలి వన్డేలో గెలిచి మంచి ఊపు మీద కనిపించిన టీమిండియా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో సమిష్టిగా విఫలమైంది. ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో 86 పరుగుల తేడాతో ఓడిపోయింది. దాంతో మూడో వన్డేకు ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో మంగళవారం జరిగే ఆఖరి వన్డేపై ఇరు జట్లు దృష్టి సారించాయి.

రెండో వన్డేలో భారీ భాగస్వామ్యాలను నెలకొల్పడంలో భారత బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో టీమిండియా మూడో వన్డేలో విజయం సాధించాలంటే ఓపెనర్లు చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సమిష్టి ప్రదర్శన చేస్తేనే విజయం వరిస్తుంది.

ఇప్పడికే టీ20 సిరిస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా... మూడో వన్డేలో విజయం సాధించి వన్డే సిరిస్‌ను కూడా కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లాండ్ మాత్రం టీ20 సిరిస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. రెండో వన్డేలో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌తో పాటు బౌలర్లు ఫామ్‌లోకి రావడం కలిసిరానుంది.

జట్ల వివరాలు:
ఇంగ్లాండ్:
ఇయాన్ మోర్గాన్ (సి), జాసన్ రాయ్, జోనీ బెయిర్ స్టో, జోస్ బట్లర్ (WK), మోయిన్ ఆలీ, జో రూట్, జేక్ బాల్, లియామ్ ఫ్లంకెట్, బెన్ స్టోక్స్, ఆదిల్ రషీద్, డేవిడ్ విల్లీ, మార్క్ వుడ్, జేమ్స్ విన్స్.

టీమిండియా:
విరాట్ కోహ్లీ(సి), దినేష్ కార్తీక్, సురేష్ రైనా, హరిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, శ్రేయాస్ అయ్యర్, సిద్దార్థ్ కౌల్, ఆక్షర పటేల్, ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శార్తుల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్.

MATCH LIVE ON SONY NETWORKS, 5 PM IST

Story first published: Monday, July 16, 2018, 18:41 [IST]
Other articles published on Jul 16, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+