For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆల్ రౌండర్ ఖాతాలో కపిల్ సరసన చేరిన అశ్విన్

India vs England 2nd Test: R Ashwin joins Kapil Dev in elite all-rounders list

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుల్లో నిలిచాడు. వర్షం కారణంగా.. ఒక్కరోజు ఆలస్యంగా.. ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ విఫలమైనా.. అశ్విన్ 29 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో.. భారత మేటి ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్ చోటు సంపాదించాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు కొద్దిమంది భారత క్రికెటర్లు మాత్రమే బంతితో 500 వికెట్లు పడగొట్టి.. బ్యాట్‌తో 3వేల పరుగులు చేశారు. ఈ జాబితాలో కపిల్‌ దేవ్ అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ ఉన్నారు. తాజాగా లార్డ్స్‌ టెస్టు‌లో కీలక ఇన్నింగ్స్‌తో అశ్విన్ కూడా చేరాడు.

అశ్విన్ కెరీర్‌లో ఇప్పటి వరకు 60 టెస్టులు, 111 వన్డేలు, 46 టీ20 మ్యాచ్‌లాడగా.. టెస్టుల్లో 2,215 పరుగులు, వన్డేల్లో 675, టీ20ల్లో 123 రన్స్ చేశాడు. బంతితో మూడు ఫార్మాట్లలో కలిపి ఈ ఆఫ్ స్పిన్నర్ మొత్తం 525 వికెట్లు పడగొట్టాడు. ఈ మధ్యనే దేశీవాలీ లీగ్‌ అయిన ఐపీఎల్ 2018లో పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతోన్న తొలి టెస్టులోనూ అద్భుత ప్రదర్శన చేశాడు.

1
42375

మరోసారి టీమిండియా.. చేజాతులారా గెలుపు అవకాశాలు జారవిడుచుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో రెండో టెస్టు. భారత్‌ 107కే ఆలౌటైంది. తర్వాత ఇంగ్లాండ్‌ 131 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ ఊపును బౌలర్లు అలాగే కొనసాగిస్తే.. ప్రత్యర్థి తక్కువ ఆధిక్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చేది. మ్యాచ్‌పై భారత్‌కు ఆశలుండేవి. కానీ భారత బౌలర్లు మళ్లీ కట్టు తప్పారు. ఆట ఆఖరుకు ఇంగ్లాండ్‌ స్కోరు 357/6. ఆధిక్యం 250.

Story first published: Sunday, August 12, 2018, 14:50 [IST]
Other articles published on Aug 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+