Independence Day: ఇంగ్లీష్ గడ్డపై భారత జెండాను ఎగురవేసిన విరాట్ కోహ్లీ!!

లండన్: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు.. బ్రిటీష్ గడ్డపైనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా లండన్‌లో ఉన్న కోహ్లీసేన జెండా పండుగను అక్కడే చేసుకున్నది. తాము బస చేసిన హోటల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత జెండాను కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎగురవేశాడు. ఈ కార్యక్రమంలో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి, ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఆటగాళ్ల కుటుంబ సభ్యులు హాజరు అయ్యారు. కోహ్లీ జెండాను ఆవిష్కరించిన అనంతరం అందరూ జాతీయ గీతం ఆలపించారు. ఈ వీడియోను బీసీసీఐ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
జెండా ఆవిష్కరణ అనంతరం:
జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో గత వారం ఇంగ్లండ్‌కు బయల్దేరిన భారత బ్యాట్స్‌మెన్‌లు పృథ్వీ షా, సుర్యకుమార్ యాదవ్ కూడా కనిపించారు. వీరు తాజాగా తమ ఐసోలేషన్ పీరియడ్‌ను పూర్తిచేసుకుని జట్టుతో కలిశారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే 3వ టెస్ట్ సెలెక్షన్స్ కోసం అందుబాటులో ఉన్నారు. వరుసగా విఫలమవుతున్న చేటేశ్వర్ పుజారా, అజింక్య రహానేలలో ,మూడో టెస్ట్ కోసం ఒకరిపై వేటుపడొచ్చనే సమాచారం తెలుస్తోంది. అదే జరిగితే సూర్య టెస్ట్ అరంగేట్రం చేయడం ఖాయమే. జెండా ఆవిష్కరణ అనంతరం లార్డ్స్ మైదానానికి భారత క్రికెటర్లు బయల్దేరి వెళ్లారు.

ఢిల్లీలోని ఎర్రకోటలో ఒలింపియన్లు:
టీమిండియా జట్టు సభ్యులు విదేశీ పర్యటనలో ఉండగా.. భారత ఒలింపియన్లు ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవానికి హాజరయ్యారు. ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వారిని కలిసి అభినందించారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం సాయంత్రం ఒలింపియన్లకు ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 'ఈ రోజు చారిత్రాత్మక ఎర్ర కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరు కావడం నాకు గౌరవంగా ఉంది . అథ్లెట్‌గా, సైనికుడిగా నా హృదయం ఉద్వేగంతో నిండిపోయింది. జై హింద్అ' ని ట్వీట్ చేశాడు.

ఆదిలోనే భారీ షాక్:
నాలుగో రోజైన ఆదివారం రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ భారత ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలను పెవిలిన్ చేర్చాడు. మూడు ఓవర్ల వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయిన భారత్ కష్టాల్లో పడింది. టెస్ట్ స్పెసలిస్ట్ చేతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీలు క్రీజులో ఉన్నారు. ఇటీవలి కాలంలో పుజారా వరుసగా విఫలమవుతుండడంతో.. ఇక భారత్ ఆశలన్ని కోహ్లీపైనే పెట్టుకుంది. ఎప్పటినుంచో కెప్టెన్ నుంచి సెంచరీ ఆశిస్తున్న అభిమానుల ఇప్పటికైనా నెరవేరుతుందో చూడాలి. మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ (180; 321 బంతుల్లో 18x4) భారీ సెంచరీ సాధించి నాటౌట్‌గా నిలిచాడు. జానీ బెయిర్‌స్టో (57; 107 బంతుల్లో 7x4) హాఫ్ సెంచరీ చేయగా.. రోరీ బర్న్స్ 49 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో మొహ్మద్ సిరాజ్ 4 వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ 3, మొహ్మద్ షమీ 2 వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌట్ అయింది. లోకేష్ రాహుల్ సెంచరీ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications