న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvENG: రెండో టెస్టులోనూ పరాజయాన్ని చవిచూసిన టీమిండియా

India Vs England 2nd Test: England Innings Highlights
 India Vs England, 2nd Test: Dominant England crush listless India by an innings and 159 runs

హైదరాబాద్: ఇంగ్లాండ్‌ గడ్డపై వరుసగా రెండో టెస్టులోనూ భారత్ పరాజయాన్ని చవిచూసింది. లార్డ్స్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమవడంతో ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ , 159 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ టెస్టులో ఆతిథ్య జట్టుకి తొలి ఇన్నింగ్స్‌లోనే 289 పరుగుల ఆధిక్యం లభించడంతో ఢీలా పడిపోయిన భారత జట్టు.. పేలవ ఆటతీరుతో డ్రా చేసుకునే అవకాశాన్ని కూడా చేజార్చుకుంది.

దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. మూడో టెస్టు మ్యాచ్ శనివారం నుంచి ట్రెంట్‌ బ్రిడ్జ్ వేదికగా జరగనుంది. బర్మింగ్‌హామ్ వేదికగా వారం క్రితం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఓవర్‌ నైట్ స్కోరు 357/6తో ఆదివారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు‌లో క్రిస్‌వోక్స్ (137 నాటౌట్: 177 బంతుల్లో 21x4) కుర్రాన్ (40: 49 బంతుల్లో 5x4, 1x6) కాసేపు దూకుడుగా ఆడారు.

1
42375

జట్టు స్కోరు 396 వద్ద కుర్రాన్ ఔటవగా 396/7తో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ను కెప్టెన్ జో రూట్ డిక్లేర్ చేశాడు. అంతకముందు ఆటలో రెండో రోజైన శుక్రవారం భారత్ జట్టు 107 పరుగులకి ఆలౌటై ఉండటంతో.. ఇంగ్లాండ్‌కి 289 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. వర్షం కారణంగా తొలి రోజు (గురువారం) ఆట మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. 289 పరుగుల లోటుతో ఈరోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు ఏ దశలోనూ సాధికారికంగా బ్యాటింగ్ చేయలేకపోయింది.

శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ తరహాలోనే ఈరోజు కూడా భారత ఓపెనర్లు మురళీ విజయ్ (0), కేఎల్ రాహుల్ (10)‌లను అండర్సన్ బోల్తా కొట్టించగా ఆ తర్వాత వచ్చిన పుజారా (17), రహానె (13), విరాట్ కోహ్లి (17), దినేశ్ కార్తీక్ (0) వరుసగా పెవిలియన్ చేరడంతో భారత్ ఓటమి ఖాయమైంది. అయితే.. ఆఖర్లో హార్దిక్ పాండ్య (26), అశ్విన్ (33 నాటౌట్) కాసేపు ఓటమి అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. భారత్ జట్టు 47 ఓవర్లలో 130 పరుగులకి ఆలౌటైంది.

Story first published: Monday, August 13, 2018, 9:06 [IST]
Other articles published on Aug 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X