విశాఖపట్నం: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 34 ఓవర్లకు గాను 3 వికెట్లు నష్టపోయి 98 పరుగులు చేసింది. దీంతో ప్రస్తుతం 292 పరుగులు ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ నిలకడగా ఆడుతున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగుల సాధించిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో కూడా అదే దిశగా కొనసాగుతున్నాడు. తన టెస్ట్ కెరీర్‌లో 50వ టెస్టు ఆడుతున్న కోహ్లీ 13వ అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 70 బంతుల్లో 6 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. కోహ్లీతో పాటు రహానే 22 పరుగులతో ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 455 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 255 పరుగులకు అలౌటైంది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 200 పరుగుల ఆధిక్యం లభించింది.
వెంట వెంటనే వికెట్లు కోల్పోయిన భారత్
రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ టాప్ ఆర్డర్ తడబడింది. ఓపెనర్ల వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. తొమ్మిదో ఓవర్‌లో మురళీ విజయ్(3), 11వ ఓవర్‌లో లోకేష్ రాహుల్(10)ను స్టువర్ట్ బ్రాడ్ పెవిలియన్‌కు పంపాడు. పుజారా కూడా ఒక్క పరుగు వద్ద అండర్సన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. 27 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 44, రహానే 17 పరుగులతో ఉన్నారు.

పుజార్ ఔట్
ఓపెనర్లు మురళీ విజయ్ (3), కేఎల్ రాహుల్ (10) తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరిన తరుణంలో క్రీజులోకి వచ్చిన పుజారా 24 బంతులాడి 1 పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అండర్సన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇన్నింగ్స్ భారం కెప్టెన్ విరాట్‌కోహ్లీ, రహానేలపై పడింది. 19 ఓవర్లు ముగిసే సరికి భారత్ 3 వికెట్లను కోల్పోయి 50 పరుగులు చేసింది.

ఓపెనర్లు విఫలం
రెండో టెస్టులో భారత ఓపెనర్లు మళ్లీ విఫలమయ్యారు. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన వేసిన 9 ఓవర్‌లో మురళీ విజయ్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత గంభీర్ స్ధానంలో జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ సైతం 10 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. బ్రాడ్ వేసిన 11 ఓవర్‌లో రాహుల్ బ్యాట్ ఎడ్జ్‌కు తగిలడంతో కీపర్ బెయిర్‌స్టో క్యాచ్ అందుకున్నాడు. తొలుత అంపైర్ ఔట్ ఇవ్వకపోవడంతో ఇంగ్లాండ్ డీఆర్‌ఎస్‌కు వెళ్లింది. డీఆర్‌ఎస్ సమీక్షలో రాహుల్ ఔట్ అని తేలడంతో పెవిలియన్‌కు చేరాడు. దీంతో ఇంగ్లాండ్ కోరిన రెండు డీఆర్‌ఎస్‌లు సక్సెస్ అయ్యాయి.
టీ బ్రేక్: భారత్ 8/0
విశాఖ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమిండియా టీ బ్రేక్ సమయానికి 6 ఓవర్లకు గాను వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. విజయ్ 3, రాహుల్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లాండ్ జట్టు తన తొలిఇన్నింగ్స్‌లో 255 పరుగులకే ఆలౌటైంది.
255 పరుగులకే ఇంగ్లాండ్ ఆలౌట్
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో భారత స్పిన్నర్ అశ్విన్ అద్భుత ప్రదర్శన చేసి మరోసారి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఫలితంగా పర్యాటక జట్టు 255 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగలకు ఆలౌటైంది.

ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 255పరుగులకే చేతులెత్తేసింది. దీంతో భారత్‌కు 200పరుగుల ఆధిక్యం లభించింది. 103/5 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ను బెయిర్ స్టో-స్టోక్స్ జోడి ఆదుకుంది. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 110 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.
ప్రమాదకరంగా మారిన ఈ జోడిని ఉమేష్ విడగొట్టాడు. 53 పరుగులు చేసిన బెయిర్ స్టోని అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం స్టోక్స్ 70 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అన్సారీ, బ్రాడ్, అండర్స్‌న్‌లు స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. భారత బౌలర్లలో అశ్విన్ ఐదు వికెట్లు తీసుకోగా, షమీ, ఉమేశ్ యాదవ్, జడేజా, జయంత్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు కోలుకుంది. మూడో రోజు లంచ్ విరామసమయానికి 81 ఓవర్లకు గాను 6 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 264 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో బెన్ స్టోక్స్ 55, రషీద్ 1 పరుగుతో ఉన్నారు. ఇంగ్లాండ్ జట్టు ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే మరో 64 పరుగులు చేయాల్సి ఉంది.
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్
రెండో టెస్టులో ఇంగ్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది. 53 పరుగులు చేసిన బెయిర్ స్టోను ఉమేష్ యాదవ్ బౌలింగ్ ఔటయ్యాడు. స్టోక్స్-బెయిర్‌స్టో జోడీ 110 పరుగులు సాధించారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి కోహ్లీ బౌలర్లను మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఆఖరికి ఇన్నిగ్స్ 79 ఓవర్‌లో ఉమేష్ బెయిర్‌స్టోని క్లీన్ బౌల్డ్ చేయడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది.

అర్ధ సెంచరీలు నమోదు చేసిన బెయిర్ స్టో, బెన్ స్టోక్స్
80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్ జట్టను బెయిర్ స్టో, బెన్ స్టోక్స్‌లు ఆదుకున్నారు. 103/5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌ను వీరిద్దరూ అర్ధ సెంచరీలతో చక్కదిద్దారు. బెన్ స్టోక్స్ 108 బంతుల్లో 7 ఫోర్లు సాయంతో అర్థ సెంచరీ సాధించగా, బెన్ స్టోక్స్ 137 బంతుల్లో 5 ఫోర్లు సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
వీరిద్దరి జోడీ 100 పైచిలుకు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో రోజు తొలి సెషన్‌లో వీరిద్దరూ నిలకడగా ఆడుతున్నారు. ఇద్దరూ కుదురుగా ఆడుతూ భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఐదు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. భారత బౌలర్లు అశ్విన్ 2, షమీ, జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.