For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నరాలు తెగే ఉత్కంఠ: రెండో టీ20లో భారత్ విజయం, చివరి ఓవర్‌లో బుమ్రా అద్భుతం

నాగ్ పూర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో కోహ్లీ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన రెండో టీ20లో టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌ను 1-1తో సమం చేసింది. ఇక, బెంగుళూరు వేదికగా ఫిబ్రవరి 1వ తేదీన చివరిదైన మూడో టీ20 జరగనుంది. టీమిండియా బౌలర్లలో నెహ్రా 3 వికెట్లు తీసుకోగా, బుమ్రా 2, మిశ్రా ఒక వికెట్ తీసుకున్నారు.

India Vs England, 2nd T20I: Eoin Morgan wins toss, invites ViratKohli to bat first

చివరి ఓవర్ ఉత్కంఠ:
చివరి ఓవర్‌లో ఇంగ్లాండ్ జట్టు 8 పరుగులు చేయాల్సి ఉండగా బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి, నాలుగో బంతుల్లో వికెట్లు తీశాడు. అటు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌లో కూడా టెన్షన్ పెరిగింది. మరోవైపు స్టేడియంలో అందరూ ఉత్కంఠతో చూశారు. విజయానికి ఇంగ్లాండ్ చివరి బంతికి 6 పరుగులు చేయాల్సి ఉంది. నిజానికి మూడు ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి సమయంలో 18వ ఓవర్ వేసిన బూమ్రా 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అయితే ఆ తర్వాత ఓవర్ వేసిన నెహ్రా 16 పరుగులు ఇచ్చాడు. దీంతో అందరూ ఇంగ్లాండ్ విజయం ఖాయమని అనుకున్నారు. ఇక చివరి ఓవర్‌ను వేసిన బుమ్రా మ్యాజిక్ చేసి టీమిండియాకు విజయాన్ని కట్టబెట్టాడు.

చివరి ఓవర్‌లో బుమ్రా అద్భుతం

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 చివరి ఓవర్‌లో బూమ్రా అద్భుతం చేశాడు. ఇంగ్లాండ్ విజయానికి 8 పరుగులు కావాల్సి వచ్చింది. ఈ సమయంలో మొదటి బంతిలోనే దూకుడుగా ఆడుతున్న జో రూట్‌ను ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్‌కు పంపాడు. 38 బంతుల్లో 38 పరుగులు చేసిన జో రూట్ ఔటవ్వడంతో మొయిన్ అలీ క్రీజులోకి వచ్చాడు. మూడో బంతిని డాట్ బాల్‌గా సంధించాడు. నాలుగో బంతికి బట్లర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో రెండు బంతుల్లో
ఇంగ్లాండ్ 7 పరుగులు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఐదో బంతికి ఒక పరుగు రాగా, ఆరో బంతిని డాట్ బాల్‌గా సంధించాడు.

కీలక మలుపు: స్టోక్స్ వికెట్ తీసిన నెహ్రా

విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టి20లో కీలక మలుపు చోటు చేసుకుంది. దూకుడుగా ఆడుతున్న రూట్, స్టోక్స్ జోడీకి నెహ్రా అడ్డుకట్ట వేశాడు. నెహ్రా బౌలింగ్‌లో స్టోక్స్ 38 (27) ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు. నెహ్రా వేసిన స్లో బంతికి వికెట్ల ముందు స్టోక్స్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లాండ్ విజయానికి 14 బంతుల్లో ఇంంకా 26 పరుగులు చేయాలి.

మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 11 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. కెప్టెన్ మోర్గాన్ 17 (23) పరుగులు చేసి ఔటయ్యాడు. మిశ్రా బౌలింగ్‌లో పాండ్యా డీప్ మిడ్ వికెట్‌లో క్యాచ్ పట్టాడు.టీమిండియా బౌలర్లలో నెహ్రా 2 వికెట్లు, మిశ్రా ఒక వికెట్‌ తీసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో జో రూట్‌ 26, స్టోక్స్‌ ఒక పరుగుతో ఉన్నారు. ఇంగ్లాండ్ విజయానికి 54 బంతుల్లో 76 పరుగులు చేయాల్సి ఉంది.

వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన నెహ్రా

145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మూడో ఓవర్లో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్ తొలి బంతికే బిల్లింగ్స్‌ను అవుట్ చేసిన నెహ్రా రెండో బంతికి జాసన్ రాయ్‌ని పెవిలియన్ పంపాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 5 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జో రూట్ 4, ఇయాన్ మోర్గాన్ 3 పరుగులతో ఉన్నారు.

ఇంగ్లాండ్‌తో విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టి20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 145 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో కచ్చితంగా గెలవాల్సి ఉంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేయడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరును సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. జోర్డాన్ 3 వికెట్లు తీసుకోగా రషీద్, అలీ, మిల్స్ తలో వికెట్ తీసుకున్నారు.

MS Dhoni

చివరి ఓవర్‌లో అనూహ్య మలుపులు
రెండో టీ20 తొలి ఇన్నింగ్న్ చివరి బంతికి ధోనీ బౌల్ట్ అయ్యాడు. జోర్డాన్ బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ దూరంగా వెళుతున్న బంతిని షాట్ కొట్టబోగా.. ఇన్‌సైడ్ ఎడ్జ్ అయి బంతి వికెట్లను తాకింది. మరోవైపు చివరి ఓవర్‌లో ధోని వికెట్‌తో పాటు మిశ్రా, పాండ్యా రనౌట్ అయ్యారు. రెండో టీ20లో టీమిండియా తొలి టీ20 కంటే మూడు పరుగులు తక్కువ స్కోరు చేసింది. కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 147 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

జోర్డాన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ అవుట్

ఇంగ్లాండ్‌తో విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టి20లో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. రెండో టీ20లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ 71 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. 47 బంతులను ఎదుర్కొన్న రాహుల్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 71 పరుగులు నమోదు చేశాడు. జోర్డాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి మిడ్ వికెట్‌లో స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా 18 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది.

రెండో టీ20లో అరుదైన సన్నివేశం

రెండో టీ20లో అరుదైన సన్నివేశం జరిగింది. బంతి వికెట్‌కు తగిలినా బెయిల్స్ పడలేదు. 15వ ఓవర్‌లో ఈ అరుదైన సన్నివేశం అందర్నీ ఆశ్చర్యపరచింది. అప్పుడు మనీష్ పాండే బ్యాటింగ్.. స్టోక్స్ బౌలింగ్. పాండే షాట్ కొట్టడానికి ప్రయత్నించగా.. బంతి దొరకలేదు. అది ఆఫ్ స్టిక్‌ను తాకి వెనక్కి వెళ్లింది. వికెట్లలో ఎల్‌ఈడీ లైట్లు ఓ క్షణం వెలిగి ఆరాయి. అయితే బెయిల్స్ మాత్రం పడలేదు. ఏం జరిగిందో తెలియక పాండే మౌనంగా ఉండిపోగా.. స్టోక్స్ మాత్రం తలపై చేతులు పెట్టుకుని తీవ్ర నిరాశ చెందాడు.

కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీ

ఇంగ్లాండ్‌తో విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టి20లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అర్ధసెంచరీని నమోదు చేశాడు. వరుసగా వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ రాహుల్ ఫోర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 34 బంతులను ఎదుర్కొన్న రాహుల్ 3 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 52 పరుగులు సాధించాడు. దీంతో టీమండియా 14 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 62, మనీష్ పాండే 9 పరుగులతో ఉన్నారు.

యువీ అవుట్: మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
ఇంగ్లాండ్‌తో విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో టి20లో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. 69 పరుగుల వద్ద మొయిన్ బౌలింగ్‌లో యువరాజ్‌సింగ్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. దీంతో తొలి టి20లో నిరాశ పరిచిన యూవీ రెండో 20లోనూ విఫలమయ్యాడు. దీంతో టీమండియా 12 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసి పీకలోతు కష్టాల్లో కూరుకుపోయింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 49, మనీష్ పాండే 4 పరుగులతో ఉన్నారు.

Yuvaraj Singh

రెండో వికెట్ కోల్పోయిన భారత్
రెండో టీ20లో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 30 పరుగుల వద్ద కోహ్లీ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన భారత్ ఆ కాసేపటికే రైనా రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. దీంతో ప్రస్తుతం 9 ఓవర్లు ముగిసే సరికి భారత్ 2 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. లోకేశ్ రాహుల్ 27, యువరాజ్ సింగ్ ఖాతా తెరవకుండా క్రీజులో ఉన్నారు.

Raina

నిరాశపరిచాడు: కెప్టెన్ కోహ్లీ అవుట్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కోహ్లీ 15 పరుగుల వద్ద అవుటయ్యాడు. రెండో టీ20లో కూడా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా వచ్చిన కోహ్లీ దూకుడుగా బ్యాటింగ్ ప్రారంభించాడు. నాలుగో ఓవర్‌ రెండో బంతిని భారీ సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత బంతినే బౌండరీకి తరలించాడు. జోర్డాన్ బౌలింగ్‌లో తొలి బంతిని భారీ షాట్ కొట్టబోయిన కోహ్లీ లాంగాన్‌లో డాసన్‌కు చిక్కాడు. ప్రస్తుతం భారత్‌ ఆరు ఓవర్లలో వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది. రాహుల్‌ 21 పరుగులు, సురేష్‌ రైనా 3 పరుగులతో క్రీజలో ఉన్నారు.

నాగ్ పూర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో కోహ్లీ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తొలి టీ20లో కూడా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత జట్టు రెండో టీ20లో కూడా టాస్ ఓడింది.

India Vs England, 2nd T20I: Eoin Morgan wins toss, invites ViratKohli to bat first

మూడు టీ20ల సిరిస్‌ సజీవంగా ఉండాలంటే భారత్‌ ఈమ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. ఇందులో గెలిస్తేనే భారత్ సిరీస్‌లో నిలబడతుంది. కానిపక్షంలో సిరీస్‌ను కోల్పోవాల్సి వస్తుంది. మరోవైపు తొలి టీ20లో గెలిచి జోరుమీదున్న ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది.

ఈ మ్యాచ్‌లో ఇరు జట్లలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియా తుది జట్టులోకి అమిత్ మిశ్రా రాగా, ఇంగ్లాండ్ జట్టులో డాసన్ వచ్చాడు. ఈ స్టేడియంలో టీమిండియా ఆడిన రెండు ట్వంటీ 20ల్లోనూ ఓటమి పాలుకావడం జట్టును కలవరపరుస్తోంది.

2009 డిసెంబర్‌లో శ్రీలంకతో తొలిసారి ఇక్కడ జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓటమి పాలైంది. ఆ తర్వాత 2016 మార్చి 15వ తేదీన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా టీమిండియా ఓటమి పాలైంది. ఇక్కడ చివరిసారి వరల్డ్ ట్వంటీ 20లో భాగంగా మార్చి 27వ తేదీన వెస్టిండీస్,అఫ్ఘానిస్తాన్ జట్ల మధ్య జరిగింది.

ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండిస్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకూ ఇక్కడ 10 ట్వంటీ 20లు జరగ్గా, వాటిలో ఏడుసార్లు మొదటి బ్యాటింగ్ చేసిన జట్టు గెలుపొందడం విశేషం. దీంతో ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా ఆ రికార్డుని చెరివేస్తుందో లేదో చూడాలి.

టీమిండియా:

ఇంగ్లాండ్:

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+