Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG T20 : క్రికెట్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్.. టికెట్ కొంటే అది ఫ్రీ

టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. స్వదేశంలో ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన వారికి బంఫర్ ప్రకటించారు. దీంతో క్రికెట్ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సారి ఏం చేస్తారో
సూర్యకుమార్‌ నాయకత్వంలో ఈ సిరీస్ బరిలోకి దిగింది భారత జట్టు. తొలి టీ20 మ్యాచ్ బుధవారం రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు సిరీస్‌ కావడం వల్ల... వరుస ఓటములో ఉన్న టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందా అని క్రికెట్ ప్రియుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై వరుసగా టెస్టు సిరీస్‌లను కోల్పోయిన టీమిండియా.. గాడినపడాలంటే ఈ పొట్టి సిరీస్‌ను కచ్చితంగా గెలిచి తీరాలి. ఇక గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ మహ్మద్ షమీ.. ఈ మ్యాచ్ తోనే మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లోకి అడుగుపెట్టాడు. దీంతో అతడు ఇప్పుడు ఎలా బౌలింగ్‌ చేస్తాడనేది కీలకంగా మారింది.

India vs England 2nd T20I Bumper offer Free Metro Travel for Chennai chepauk stadium match Ticket Holders

టికెట్ కొంటే అది ఫ్రీ

రెండో మ్యాచ్‌ శనివారం నాడు చెన్నై చెపాక్‌ వేదికగా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. దీంతో స్టేడియానికి వచ్చే క్రికెట్ ప్రేక్షకులకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బంఫర్ ఆఫర్ ప్రకటించింది. మ్యాచ్‌ను చూసేందుకు వచ్చే ఫ్యాన్స్ కోసం ఉచిత మెట్రో ప్రయాణం కల్పించినట్లు పేర్కొంది. టికెట్లు కొన్న ప్రతి ఒక్కరూ ఈ ఫ్రీ మెట్రో సర్వీస్ ను వినియోగించుకోవచ్చని వెల్లడించింది.

గతంలోనూ ఇలానే
2023 ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఇలానే ఫ్రీ మెట్రో సర్వీస్ వెసులుబాటును కల్పించారు. చెన్నైలో జరిగిన మ్యాచ్‌లకు మెట్రో సేవలను ఉచితంగా అందించారు. చెపాక్‌ స్టేడియం చుట్టు పక్కల ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Story first published: Wednesday, January 22, 2025, 8:47 [IST]
Other articles published on Jan 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+