రెండో టీ20: టీమిండియా నమోదు చేసిన రికార్డులివే
హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో టీ20 తీవ్ర ఉత్కంఠను రేపింది. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతూ ఆఖరి నిమిషం వరకు నువ్వానేనా అన్నట్లు జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది.
చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్‌ప్రీత్ బుమ్రా (2/20) మ్యాజిక్ చేయడంతో మూడు టీ20 సిరిస్‌లో టీమిండియా ఆశలు సజీవంగా ఉంచుకుంది. కేఎల్ రాహుల్ (71) అర్ధ సెంచరీతో రాణించడంతో పాటు ఆశీష్ నెహ్రా (3/28), చివరి ఓవర్లో బుమ్రా అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌పై 5 పరుగులతో భారత్ విజయం సాధించింది.
దీంతో మూడు టీ20ల సిరిస్‌ను 1-1తో సమం చేసింది. 145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయి 139 పరుగులకే ఆలౌటైంది. రెండో టీ20 చివరి ఓవర్‌లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా నిలిచాడు. ఈ సిరిస్‌లో చివరి టీ20 ఫిబ్రవరి 1న బెంగళూరులో జరగనుంది.
రెండో టీ20లో నమోదైన పలు రికార్డులు:

ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ రికార్డు
కేఎల్ రాహుల్ నమోదు చేసిన 71 పరుగులే ఇంగ్లండ్‌పై భారత బ్యాట్స్‌మెన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతకు ముందు 2007లో డర్బన్‌లో జరిగిన మ్యాచ్‌లో అతడు 68 పరుగులు చేశాడు.

200 వికెట్లు తీసిన అమిత్ మిశ్రా
టీ20ల్లో 200 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా అమిత్ మిశ్రా రికార్డు సాధించాడు. అతని కంటే ముందు అశ్విన్ ఈ ఘనతను సాధించాడు.

రెండో భారత బౌలర్‌గా ఆశీష్ నెహ్రా రికార్డు
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా ఆశీష్ నెహ్రా రికార్డు సాధించాడు. అతని కంటే ముందు ఈ జాబితాలో టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 52 వికెట్లు తీసుకున్నాడు.

తక్కువ పరుగులు చేసి గెలవడం ఇది రెండోసారి
టీమిండియా టీ20ల్లో 150 అంతకన్నా తక్కువ పరుగులు చేసినా గెలిచిన సందర్భాల్లో ఇది రెండవది. అంతక ముందు జింబాబ్వేపై 138 పరుగులు చేసి గెలిచింది. టీమిండియా తక్కువ పరుగుల తేడాతో గెలిచిన మ్యాచ్‌ల్లో ఇది ఐదో మ్యాచ్ కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications