Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చివర్లో కోహ్లీ ఒత్తిడి: అన్నీ తానై ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన ధోని

హైదరాబాద్: కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్‌పై టీమిండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ వన్డేలో ఇరు జట్లు కూడా 350కి పైగా పరుగులు చేయడం విశేషం. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనిల జోడీ ఆదుకుంది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 256 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 150 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువరాజ్ వోక్స్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

అంతక ముందు 126 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగాడు. సెంచరీ అనంతరం దూకుడుగా ఆడిన యువీ అంతే వేగంగా 150 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. ధోని సైతం 106 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు.

ఆరేళ్ల త‌ర్వాత సెంచరీ చేసిన యువరాజ్

ఆరేళ్ల త‌ర్వాత సెంచరీ చేసిన యువరాజ్

2011లో చివ‌రిసారిగా వరల్డ్ కప్‌లో సెంచ‌రీ సాధించిన యువరాజ్ మ‌ళ్లీ ఆరేళ్ల త‌ర్వాత సెంచరీని సాధించడం విశేషం. ఇక ధోనీ కూడా 2013లో ఆస్ట్రేలియాపై చివరిసారిగా సెంచరీ చేశాడు. వీరిద్దరి విజృంభషణతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లను కోల్పోయి 381 పరుగులు చేసింది.

ధాటిగా ఆడిన ఇంగ్లాండ్

ధాటిగా ఆడిన ఇంగ్లాండ్

అనంతరం 382 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ధాటిగానే ఆడింది. లక్ష్య చేధనలో భాగంగా ఇంగ్లాండ్‌ 8 వికెట్లు కోల్పోయి 366 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్ 102 పరుగులు, జాసన్ రాయ్ 82, రూట్ 54, మొయిన్ అలీ 55 పరుగులతో రాణించినా ఇంగ్లాండ్‌ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయారు.

ఇయాన్ మోర్గాన్ సెంచరీ

ఇయాన్ మోర్గాన్ సెంచరీ

ఒకవైపు వికెట్లు పడుతున్నా రన్ రేట్‌ను కాపాడుకుండూ బ్యాటింగ్ కొనసాగిచింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. 81 బంతుల్లో ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. 48 ఓవర్ మూడో బంతికి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న మోర్గాన్ పరుగు కోసం యత్నించి రనౌట్ అయ్యాడు.

నిర్ణీత 50 ఓవర్లలో 366 పరుగులు చేసిన ఇంగ్లాండ్

నిర్ణీత 50 ఓవర్లలో 366 పరుగులు చేసిన ఇంగ్లాండ్

మోర్గాన్‌ ఔట్ తర్వాత మిగిలిన వారు చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 366 పరుగులతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది. అయితే ఒకానొక దశలో ఇంగ్లండ్ ఆటగాళ్లు తేలికగానే టార్గెట్‌ను ఛేదించేలా కనిపించారు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు.

ఒత్తిడిలో కనిపించిన కోహ్లీ

ఒత్తిడిలో కనిపించిన కోహ్లీ

బంతి అందించిన ప్రతి బౌలర్‌తో మంతనాలు జరిపాడు. ప్రతి బంతికి ఏదో ఒక సూచన ఇస్తూ వారిపై ఒత్తిడి పెంచాడు. అయితే ఇది ఎంత మాత్రం మంచిది కాదని భావించిన ధోని వెంటనే కెప్టెన్‌గా రంగంలోకి దిగాడు. బౌలర్లకు అనుకూలంగా ఫీల్డింగ్‌ను సరిచేస్తూ కనిపించాడు. అన్నీతానై ఫీల్డింగ్‌ సెట్‌ను చేశాడు. తీవ్ర ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై టీమిండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+