For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వారిద్దరి వల్లే ఓడిపోయాం: కోహ్లీ

India Vs England 2nd ODI: England Beat India By 86 Runs To Level Series 1-1
India vs England 2nd ODI: Virat Kohli slams MS Dhonis critics, says people wait for chances to jump on him

హైదరాబాద్: సిరీస్ దక్కించుకోవాలనే ఆరాటంతో బరిలోకి దిగిన భారత్‌కు ఇంగ్లాండ్ బ్రేక్ వేసింది. టీ20 సిరీస్ మాదిరిగానే వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారడంతో.. మంగళవారం జరగనున్న వన్డే నిర్ణయాత్మకంగా మారి ఉత్కంఠకు దారితీసింది. శనివారం జరిగిన రెండో వన్డేలో కోహ్లిసేన 86 పరుగుల తేడాతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమికి ఇంగ్లండ్‌ స్పిన్నర్లే కారణమని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చెప్పుకొచ్చాడు.

మ్యాచ్‌ అనంతరం మాట్లాడుతూ.. 'బ్యాటింగ్‌లో మా ఆరంభం అదిరింది. కానీ వరుసగా మూడు వికెట్లు కోల్పోవడంతో నష్టం కలిగింది. ఈ క్రెడిట్‌ అంతా బౌలర్లదే. ముఖ్యంగా మోయిన్‌ అలీ, రషీద్‌లు అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఈ ఫార్మాట్‌లో వారు నాణ్యమైన బౌలర్లు. అందుకే రిస్క్‌ చేయలేకపోయాం. మిడిల్‌ ఓవర్లలో వారిద్దరు మాపై ఒత్తిడి తీసుకొచ్చారు.'

1
42372

'ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు విఫలమైనా దాటిగా ఆడేవాళ్లం. అ‍ప్పుడు ఫలితం వేరేలా ఉండేది. మేం ప్రస్తుతం కొత్త ఆటగాళ్లను పరీక్షిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లు ఎలా పుంజుకుంటారనేది చాలా ముఖ్యం. అందరికి చెడు రోజులుంటాయి. ఇలా ఈ రోజు మాకు బ్యాడ్‌ డేగా మిగిలిపోయింది.' అని కోహ్లి చెప్పుకొచ్చాడు.

మోయిన్‌ అలీ, రషీద్‌లు పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో భారత బ్యాట్స్‌మన్‌ ఒత్తిడికి లోనై వికెట్లు చేజార్చుకున్నారు. రషీద్‌ రెండు వికెట్లు తీయగా మోయిన్‌ అలీ కీలక కోహ్లి వికెట్‌ పడగొట్టాడు. జో రూట్‌ (116 బంతుల్లో 113; 8 ఫోర్లు, 1 సిక్స్‌) మోర్గాన్‌ (51 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్‌), విల్లే (31 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌)లు రాణించడంతో​ ఇంగ్లండ్‌ 322 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ లక్ష్యఛేదనలో భారత్‌ బ్యాట్స్‌మన్‌ చేతులెత్తేశారు. కోహ్లి (56 బంతుల్లో 45; 2 ఫోర్లు), రైనా (63 బంతుల్లో 46; 1 ఫోర్‌), ధోని (59 బంతుల్లో 37; 2 ఫోర్లు)లు పరువు కాపాడేందుకు యత్నించాడు.

Story first published: Tuesday, July 17, 2018, 16:20 [IST]
Other articles published on Jul 17, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+