వరుసగా ఆరో సిరిస్‌పై కన్నేసిన కోహ్లీసేన: కుల్దీప్‌ను అడ్డుకునేనా!


హైదరాబాద్: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా మరో సిరిస్‌పై కన్నేసింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య శనివారం రెండో వన్డే జరగనుంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఈ మ్యాచ్‌కు ఇందుకు వేదిక కానుంది. మూడు వన్డేల సిరిస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో గెలిచి వరుసగా ఆరో వన్డే సిరిస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.
2016, జనవరిలో ఆస్ట్రేలియాలో పర్యటించినప్పటి నుంచి కోహ్లీ సేన వరుసగా వన్డే సిరిస్‌లను గెలుచుకుంటుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది. తుది జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. వెన్ను నొప్పితో బాధపడుతున్న భువనేశ్వర్ కోలుకుంటే కౌల్ స్థానంలో తుది జట్టులో చోటు దక్కించుకోవచ్చు.

తొలి వన్డే జట్టునే యధావిధిగా
లేదంటే తొలి వన్డే జట్టునే యధావిధిగా కొనసాగించే అవకాశాలున్నాయి. ఓపెనర్ రోహిత్ సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంకాస్త గాడిలో పడాల్సి ఉంది. ఈ ఇద్దరూ చక్కటి ఓపెనింగ్ ఇస్తే, టీమిండియా భారీ స్కోరు చేసే అవకాశం ఉంది. తొలి వన్డేలో కోహ్లీ నాలుగోస్థానంలో వస్తాడని భావించినా.. చివరి నిమిషంలో మళ్లీ వన్‌డౌన్‌లోనే దిగాడు.

భారత విజయంలో కుల్దీప్ కీలకపాత్ర
ఇక రైనా, పాండ్యా, ధోనీలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. స్పిన్‌లో కుల్దీప్, చాహల్ అంచనాలను మించి రాణిస్తున్నారు. కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదు చేసిన కుల్దీప్ మొదటి వన్డే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, ఇంగ్లాండ్ విషయానికి వస్తే కుల్దీప్‌పైనే దృష్టి సారించింది. కుల్దీప్ ఎలా ఎదుర్కోవాలో ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌కు అర్థం కావడం లేదు.

సిరిస్ నుంచి తప్పుకున్న అలెక్స్ హేల్స్
మరోవైపు, గాయం కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన అలెక్స్ హేల్స్ ఇప్పుడు సిరీస్ నుంచే తప్పుకొన్నాడు. దీంతో అతడి స్థానంలో బెన్ స్టోక్స్‌ను ఇంగ్లండ్ కొనసాగించనుంది. ఇటీవల కాలంలో నిలకడ ప్రదర్శన చేస్తోన్న జోస్ బట్లర్ మరోసారి కీలకం కానున్నాడు. పేసర్లు విల్లే, ప్లంకెట్ ఆశించిన విధంగా రాణించలేకపోతున్నారు.

జట్లు (అంచనా)
భారత్: కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధవన్, రాహుల్, రైనా, ధోనీ, పాండ్యా, చాహల్, కుల్దీప్, కౌల్ / భువనేశ్వర్, ఉమేశ్.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బెయిర్‌స్టో, రూట్, స్టోక్స్, బట్లర్, అలీ, విల్లే, రషీద్, ఫ్లంకెట్, వుడ్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications