For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ భవిష్యత్ ఆశాకిరణం: ఓపెనర్ దొరికినట్లే!

By Nageshwara Rao

రాజ్‌కోట్: ఆండ్రూ స్ట్రాస్ వీడ్కోలు తర్వాత సరైన ఓపెనింగ్ భాగస్వామ్యం లేక నానా తంటాలు పడుతున్న ఇంగ్లాండ్ జట్టుకు హబీబ్ హమీద్ రూపంలో ఓపెనింగ్ దొరికినట్లు అనిపిస్తోంది. భారత సంతతికి చెందిన హబీబ్ హమీద్ రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.

అరంగేట్రంలోనే భారత జట్టుపై 110 ఏళ్ల రికార్డుని బద్దలు కొట్టడమే కాకుండా అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చి జట్టులో తన స్ధానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. నిజానికి గత నాలుగేళ్లుగా సరైన ఓపెనింగ్ భాగస్వామ్యం లేక ఇంగ్లాండ్ జట్టు తంటాలు పడుతోంది.

ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ అలెస్టర్ కుక్‌తో ఎంతో మంది ఓపెనింగ్ బ్యాట్స్ మెన్లు వచ్చినా అంతగా విజయవంతం కాలేదు. అయితే రాజ్‌కోట్ టెస్టుతో ఇంగ్లాండ్‌కు ఓపెనింగ్ సమస్య తీరినట్లే. గత నాలుగేళ్లగా ఇంగ్లాండ్ జట్టు సుదీర్ఘ అన్వేషణకు హబీబ్ హమీద్ రూపంలో ముగింపు దొరికినట్లేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

India vs England, 2016: Haseeb Hameed may be answer to England opening conundrum

ఇంగ్లాండ్ టెస్టు జట్టులో అలెస్టర్ కుక్‌కు ఓపెనింగ్ వచ్చిన పదో ఆటగాడిగా హబీబ్ హమీద్ గుర్తింపు పొందాడు. అంతేకాదు రాజ్‌కోట్ టెస్టులో ఇంగ్లాండ్ జట్టులో అరంగేట్రం చేసిన హసీబ్ హమీద్.. కుక్‌కు సరైన జోడీ అవుతాడని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 82 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసిన హమీద్.. రెండో ఇన్నింగ్స్‌లో తన అద్భుతమైన ఆటతీరుతో మరింతగా ఆకట్టుకున్నాడు. 177 బంతులను ఎదుర్కొన్న హమీద్ 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 82 పరుగులు సాధించి ఇంగ్లాండ్ జట్టు తరుపున అరుదైన రికార్డును నెలకొల్పాడు.

India vs England, 2016: Haseeb Hameed may be answer to England opening conundrum

1906లో కేప్ టౌన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ అటగాడు జాక్ క్రాఫర్డ్ చేసిన 74 పరుగుల రికార్డుని కూడా హసీబ్ హమీద్ రాజ్ కోట్ టెస్టులో అధిగమించి చరిత్ర సృష్టించాడు. ఇదే విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా తన ట్విట్టర్‌లో పేర్కొంది.

తన అరంగేట్రం మ్యాచ్‌లోనే రాణించిన హమీద్‌ను ఇంగ్లాండ్ భవిష్య ఆశాకిరణంగా మాజీలు పేర్కొంటున్నారు. 19 ఏళ్ల హమీద్‌ను ఇంగ్లండ్ దిగ్గజ ఆటగాడు జెఫ్రీ బాయ్ కాట్‌తో పోల్చడం కూడా అతనికి కలిసొచ్చే అంశం. హమీద్ బ్యాటింగ్ శైలి బాయ్ కాట్‌ను పోలి ఉండటంతో 'బేబీ బాయ్‌కాట్' గా పిలుచుకుంటున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+