న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ట్విట్టర్ వేదికగా కేఎల్ రాహుల్‌పై చివాట్లు

India vs England, 1st Test: Twitter trolls KL Rahul after rash dismissal, calls for Cheteshwar Pujaras entry

ఎడ్జ్‌బాస్టన్: ఇంగ్లాండ్-ఇండియా టెస్టు సిరీస్‌కు ముందు ఓపెనర్‌గా బరిలోకి ఎవరి దింపాలా అనే చర్చల్లో మురళీ విజయ్, ధావన్, కేఎల్ రాహుల్‌ ఉన్నారు. ఓపెనర్‌గా దిగి పరుగులు రాణిస్తాడనుకున్న తరుణంలో పేలవ ప్రదర్శన చేశాడు. గురువారం తొలి టెస్టుకు తుది జట్టులో టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారాని పక్కన పెట్టిన టీమిండియా.. అతని స్థానంలో కేఎల్‌ రాహుల్‌కి తుది చోటిచ్చింది. కానీ.. రెండు బంతులు మాత్రమే ఆడిన కేఎల్ రాహుల్ (4) వికెట్లపైకి బంతిని ఆడుకుని ఔటయ్యాడు.

మురళీ విజయ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్ బాధ్యతారాహిత్యంగా షాట్ ఆడి వికెట్ చేజార్చుకోవడంతోనే భారత జట్టు బంతి వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిందని అభిమానులు మండిపడుతున్నారు. ఇంగ్లాండ్ గడ్డపై టీ20, వన్డేల్లో మెరుగ్గా ఆడిన కేఎల్ రాహుల్‌కి తొలి టెస్టులో కోహ్లి అవకాశమిచ్చాడు. కానీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌తో పోలిస్తే.. టెస్టులు భిన్నమనే విషయాన్ని ఈ హిట్టర్ మరిచిపోయినట్లున్నాడని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు.

టెస్టుల్లో వేగంగా వికెట్ చేజార్చుకోవడం రాహుల్ బలహీనతంటూ కొందరు విమర్శిస్తుండగా.. పుజారాని టెస్టు జట్టులోకి తీసుకుంటే మరోలా ఉండేదంటూ మరికొందరు సూచిస్తున్నారు. కొద్ది రోజుల ముందు వరకూ కౌంటీ క్రికెట్లో ఆడిన పూజారా పెద్దగా రాణించలేకపోవడంతో అతణ్ని టెస్టు జట్టులోకి తీసుకోకుండా పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.

అయితే, కోహ్లీ జట్టు నాయకుడిగానే కాదు, బ్యాట్స్‌మెన్‌గానూ అద్భుత ప్రదర్శన చేశాడు. వరుసగా వికెట్లు పడిపోతున్నా.. తానొక్కడై నిలిచి జట్టుకు మంచి స్కోరును అందించాడు. 54పరుగుల వద్ద క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. 225 బంతులు ఆడి 149 పరుగులు చేశాడు. కాగా, కోహ్లీ కెరీర్‌లో ఇది 22వ సెంచరీ. గతంలో కెప్టెన్‌గా గంగూలీ, ధోనీ ఈ రికార్డును నమోదు చేశారు. ఎట్టకేలకు భారత్ 274 పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు కేవలం 13పరుగుల ఆధిక్యం మాత్రమే ఇచ్చింది.

Story first published: Friday, August 3, 2018, 12:13 [IST]
Other articles published on Aug 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X