
వరణుడి ఖాతాలోకి తొలి సెషన్
209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 52 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఆచితూచి ఆడారు. రోహిత్ క్రీజులో నిలదొక్కుకోవటానికి ప్రయత్నించగా.. రాహుల్ వేగంగా ఆడాడు. ధాటిగా ఆడే క్రమంలో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో రాహుల్ కీపర్ చేతికి చిక్కాడు.
దాంతో భారత్ 34 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. అనంతరం జోడీ కట్టిన రోహిత్, పుజారా మరో వికెట్ పడకుండా నాలుగో రోజు ఆటను ముగించారు. కోహ్లీసేన విజయానికి ఇంకా 157 పరుగులు అవసరం కాగా.. చేతిలో 9 వికెట్లు ఉన్నాయి. రోహిత్ శర్మ (12), చెటేశ్వర్ పుజారా (12) క్రీజులో ఉన్నారు. ఇక ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు మ్యాచ్ జరుగుతున్న నాటింగ్‌హామ్‌లో వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ ఆలస్యం అయింది. వర్షం ఇంకా తగ్గకపోవడంతో.. తొలి సెషన్ వరణుడి ఖాతాలోకి వెళ్లిపోనుంది.
టోక్యో ఒలింపిక్స్ కోసం.. వాటికి ఆరు నెలలు దూరంగా ఉన్న నీరజ్ చోప్రా!!

భారత్ గెలవడం ఇష్టం లేదేమో:
వర్షం తగ్గాలని ప్రతి భారత అభిమాని కోరుకుంటున్నాడు. అదే సమయంలో మరికొందరు వరణుడిపై మండిపడుతున్నారు. టెస్ట్ చాంపియన్‌షిప్ పోగొట్టింది చాలదా?, తొలి టెస్ట్ విజయాన్ని కూడా అడ్డుకుంటావా?, భారత్ అంటే ఎందుకంత కసి, కోహ్లీసేన గెలవడం ఇష్టం లేదా? అని ట్వీట్లు చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 183 పరుగులకే కుప్పకూలగా.. భారత్ 278 పరుగులు చేసి 95 పరుగుల కీలకమైన ఆధిక్యాన్ని సంపాదించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌట్ కావడంతో.. రూట్ సేనకు 208 పరుగుల ఆధిక్యం దక్కింది.

ఉదయం నుంచి వర్షం:
ఈ టెస్టు మ్యాచ్‌కి ఆరంభం నుంచి వరుణుడు అడ్డుపడుతున్నాడు. తొలిరోజు ఆట సజావుగా సాగగా.. రెండు, మూడు రోజుల్లో చివరి సెషన్లు రద్దైయ్యాయి. నాలుగో రోజు ఆట సజావుగానే సాగగా.. మ్యాచ్ రసవత్తరంగా సాగింది. నాలుగో రోజు చివరకు భారత్ ఆధిపత్యం చెలాయించింది. విజయానికి కేవలం 157 పరుగుల దూరంలోనే ఉంది. ఇప్పటికే కొన్ని గంటల విలువైన మ్యాచ్ సమయం వేస్ట్‌కాగా.. ఈరోజు కనీసం ఓ రెండు సెషన్ల ఆట జరిగినా భారత్ జట్టు గెలుపు లక్ష్యాన్ని అందుకునే అవకాశం ఉంది. కానీ నాటింగ్‌హామ్ పరిసరాల్లో ఈరోజు ఉదయం నుంచి వర్షం పడుతోంది. దాంతో అది కూడా సాధ్యం కాకపోవచ్చు. వరణుడు కరుణిస్తాడేమో చూడాలి. ఇంగ్లండ్ గడ్డపై మొత్తం ఐదు టెస్టుల సిరీస్‌ని టీమిండియా ఆడనుంది.


Click it and Unblock the Notifications












