For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ vs ఇంగ్లాండ్, డే2: తానొక్కడై భారత్‌ స్కోరును పరిగెత్తించిన కోహ్లీ

India vs England : England Scores 287 Runs By The End
India vs England 1st Test Day 2: England 9/1 at stumps, lead India by 22 runs

హైదరాబాద్: ఇంగ్లీషు జట్టంతా కలిసి వ్యూహరచన చేసింది. కోహ్లీని కట్టడి చేశాయాలంటూ ప్రణాళిక రచించింది. అదే పంథాలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు అంతా తలకిందులైపోయింది. భారత్‌ను కట్డడిచేశామనుకుంటున్న సమయంలో రాజే సైనికుడై.. జట్టును ముందుకు నడిపించాడు విరాట్. ఇలా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినా టీమిండియాను కోహ్లీ అద్వితీయ సెంచరీతో నెట్టుకొచ్చాడు. మ్యాచ్‌ రెండో రోజు, గురువారం తొలి ఇన్నింగ్స్‌లో 100కే ఐదు వికెట్లు కోల్పోయిన భారత్‌.. విరాట్‌ కోహ్లి (149) 225 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సు భారీ సెంచరీతో 274 పరుగులు చేసింది.

1
42374
విజృంభించిన కరన్.. వరుస వికెట్లు:

విజృంభించిన కరన్.. వరుస వికెట్లు:

ఓవర్‌నైట్‌ స్కోరు 287/9తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లాండ్‌‌కు చక్కని ఆరంభమే లభించింది. కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి అవుట్ అయ్యేలా చేసింది. అండర్సన్‌, బ్రాడ్‌లను ఓపెనర్లు విజయ్‌(20) , ధావన్‌(26) జాగ్రత్తగా ఎదుర్కొన్నారు. కానీ కరన్‌ విజృంభణతో భారత్‌ తడబాటు మొదలైంది. మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. భారత్‌ చకచకా మూడు వికెట్లు చేజార్చుకుని 59/3కు పడిపోయింది. కరన్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడొగొట్టి భారత్‌ను గట్టి దెబ్బతీశాడు. మొదట ఓ ఇన్‌ స్వింగర్‌తో అతడు విజయ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక రాహుల్‌(4) దూరంగా వెళ్తున్న బంతిని వికెట్ల మీదకు ఆడుకున్నాడు. కరన్‌ తర్వాతి ఓవర్లో ఔట్‌ స్వింగర్‌ను డ్రైవ్‌ చేయబోయిన ధావన్‌.. మలన్‌ చేతికి చిక్కాడు. కోహ్లికి రహానె (15) జత కలవడంతో వికెట్‌ పతనం కాసేపు ఆగింది.

. ఇంగ్లాండ్‌ కేవలం 13 పరుగుల ఆధిక్యంతో..

. ఇంగ్లాండ్‌ కేవలం 13 పరుగుల ఆధిక్యంతో..

తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులకు ఆలౌటైన ఇంగ్లాండ్‌ కేవలం 13 పరుగుల ఆధిక్యంతో సరిపెట్టుకుంది. ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌ కుక్‌ (0) వికెట్‌ కోల్పోయి 9 పరుగులు సాధించింది. మ్యాచ్‌లో భారత్‌ ఇంకా నిలిచింది అంటే, ఇంకా ఆశలు కోల్పోలేదంటే కారణం ఒకే ఒక్కడు.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి! ఓ వైపు ఇంగ్లాండ్‌ బౌలర్లు ఒత్తిడి తెస్తున్నా.. వికెట్లు పోతున్నా అతడు సహనంగా నిలబడ్డాడు.

స్కోరు 54 వద్ద క్రీజులోకి వచ్చిన కోహ్లి

స్కోరు 54 వద్ద క్రీజులోకి వచ్చిన కోహ్లి

జట్టు స్కోరు 54 వద్ద క్రీజులోకి వచ్చిన కోహ్లి స్వింగ్‌ను, సీమ్‌ను జాగ్రత్తగా గమనిస్తూ పోరాటాన్ని కొనసాగించాడు. లోపలికి దూసుకొచ్చిన బంతులను అద్భుతంగా డిఫెన్స్‌ ఆడాడు. కొన్ని సార్లు బంతులు ఎడ్జ్‌లను తాకాయి. ఆఫ్‌స్టంప్‌ లోగిలిలో బంతులతో అండర్సన్‌.. కోహ్లిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ విజయవంతం కాలేకపోయాడు. కోహ్లి మొండిగానే నిలబడ్డాడు. అక్కడక్కడా గతి తప్పిన బంతులను బౌండరీ దాటించాడు. కరన్‌, స్టోక్స్‌లనూ అతడు సమర్థంగానే ఎదుర్కొన్నాడు.

 స్టోక్స్‌ బౌలింగ్‌లో బౌండరీతో హాఫ్ సెంచరీ

స్టోక్స్‌ బౌలింగ్‌లో బౌండరీతో హాఫ్ సెంచరీ

ఒత్తిడికి లోనవుతూ, ఔటయ్యే ప్రమాదాలను తప్పించుకుంటూ కాస్త సహకారం అందించిన హార్దిక్‌ పాండ్య (22) 52 బంతుల్లో 3 ఫోర్లతో ఆరో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. ఉన్నంతసేపూ ఊగిసలాడిన పాండ్య జట్టు స్కోరు 148 వద్ద కరన్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత కోహ్లి కాస్త దూకుడు పెంచాడు. మరింత సాధికారికంగా, మరింత ఆత్మవిశ్వాసంతో షాట్లు కొట్టడం మొదలు పెట్టాడు. అశ్విన్‌, ఇషాంత్‌లు అండగా నిలిచిన కాసేపు జట్టుకు ఎంతో విలువైన పరుగులు జోడించాడు. స్టోక్స్‌ బౌలింగ్‌లో బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

150 పరుగుల మైలురాయికి ఒక్క పరుగు దూరంలో

150 పరుగుల మైలురాయికి ఒక్క పరుగు దూరంలో

అండర్సన్‌ బౌలింగ్‌లో అశ్విన్‌ (10), షమి (2) కొద్ది తేడాలో ఔటైనా కోహ్లి చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఇషాంత్‌ 17 బంతుల్లో (5) తో తొమ్మిదో వికెట్‌కు విలువైన 35 పరుగులు జోడించాడు. ఇషాంత్‌ ఔటైనా ఉమేశ్‌ అండగా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. స్టోక్స్‌ బంతిని పాయింట్‌ దిశగా బౌండరీ దాటించి సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి.. తర్వాతి బంతికి మిడాన్‌ దిశగా బౌండరీ రాబట్టాడు. అదే దూకుడుతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివరికి 150 పరుగుల మైలురాయికి ఒక్క పరుగు దూరంలో వెనుదిరిగాడు. ఉమేశ్‌తో ఆఖరి వికెట్‌కు కోహ్లి 57 పరుగులు జోడించాడు.

Story first published: Friday, August 3, 2018, 9:29 [IST]
Other articles published on Aug 3, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+