న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs England 1st Test, Day 1: లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 83/1

By Nageshwara Rao
England Vs India : England Lost One Wicket
India vs England 1st Test, Day 1: Virat Kohli and Co all set for English challenge

లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 83/1
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌ లంచ్ విరామానికి వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జో రూట్ (31), జెన్నింగ్స్ (38) పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు నిలకడగా బ్యాటింగ్ చేస్తోంది. ఇంగ్లాండ్ కోల్పోయిన ఒక్క వికెట్ అశ్విన్‌ పడగొట్టాడు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్ల ఏడో ఓవర్లోనే అశ్విన్‌ను బరిలోకి దింపి ఆశ్చర్యపరిచాడు. తొలి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ వేశాడు. తన తర్వాతి ఓవర్లోనే స్టార్ బ్యాట్స్‌మన్ అలిస్టర్ కుక్‌(13)ను ఔట్ చేసి భారత్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. అశ్విన్ వైవిధ్య బంతిని డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి నేరుగా వెళ్లి వికెట్లను తాకింది. దీంతో భారత్‌కు 9వ ఓవర్‌లోనే శుభారంభం దక్కింది.

టెస్టుల్లో అశ్విన్ బౌలింగ్‌లో కుక్ ఔటవడం ఇది ఎనిమిదో సారి. అత్యధికంగా అతని బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొమ్మిదిసార్లు వెనుదిరిగాడు.


తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ అలెస్టర్ కుక్(13) పరుగుల వద్ద రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్ (6), జెన్నింగ్స్(17) పరుగులతో ఉన్నారు.


ఇంగ్లాండ్ బ్యాటింగ్, పుజారాకు దక్కని చోటు

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభమైంది. సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఇంగ్లాండ్‌కు ఈ టెస్టు మ్యాచ్ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టుకు 1000వ టెస్టు. 1877లో టెస్టు హోదా పొందిన ఇంగ్లాండ్ జట్టు తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడింది. ఇప్పటివరకు 999 మ్యాచ్‌లు పూర్తి చేసింది. ఇందులో 357 టెస్టులు గెలువగా, 297 మ్యాచ్‌ల్లో ఓడింది. 345 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

భారత్‌తో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్టుతో టెస్టు క్రికెట్ చరిత్రలో 1000 టెస్ట్‌లు ఆడిన తొలి జట్టుగా ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. కాగా, ఈ సిరీస్‌ గెలిచి ప్రపంచ అత్యుత్తమ పర్యాటక జట్టుగా పేరు నిలబెట్టుకోవాలని కోహ్లీసేన ఊవిళ్లూరుతోంది. గత పర్యటనలో విఫలమైన కెప్టెన్ కోహ్లీ ఈసారి సత్తా చాటాలని భావిస్తున్నాడు.

1
42374

బర్మింగ్‌హామ్‌లో ఆకాశంలో మబ్బులతో కమ్ముకుని ఉంది. బంతి స్వింగ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కెప్టెన్ కోహ్లీ తుది జట్టు ఎంపికలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. పుజారాను జట్టులోకి ఎంపిక చేయలేదు. అనూహ్యంగా వార్మప్ మ్యాచ్‌లో రెండు సార్లు డకౌటైన ఓపెనర్ శిఖర్‌ ధావన్‌కు చోటు కల్పించాడు.

India vs England 1st Test, Day 1: Virat Kohli and Co all set for English challenge

భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగే ఎడ్జ్‌బాస్టన్‌లోనే ఇంగ్లిష్ టీమ్ 50 టెస్టులు ఆడింది. ఇరుజట్ల మధ్య ఆరు టెస్టులు జరిగితే ఇందులో ఇంగ్లండ్ 5-0తో ఆధిక్యంలో కొనసాగుతున్నది. 1902లో ఆసీస్‌తో ఇక్కడ మొదటి టెస్టు జరిగింది. 27 మ్యాచ్‌ల్లో నెగ్గగా, 8 టెస్టులో ఓడి.. 15 మ్యాచ్‌లను డ్రా చేసుకుంది.

తొలి టెస్టు ఆరంభానికి ముందు న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, ఐసీసీ ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో.. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్‌కు వెండి జ్ఞాపికను అందజేశారు.

జట్ల వివరాలు:
టీమిండియా:
మురళీ విజయ్‌, శిఖర్‌ ధావన్‌, లోకేశ్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, అజింక్య రహానె, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి
ఇంగ్లాండ్‌: అలిస్టర్‌ కుక్‌, కీటన్‌ జెన్నింగ్‌స, జో రూట్‌, డేవిడ్‌ మలన్‌, జానీ బెయిర్‌స్టో, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌, అదిల్‌ రషీద్‌, సామ్‌ కురన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జేమ్స్‌ అండర్సన్‌

Story first published: Wednesday, August 1, 2018, 17:39 [IST]
Other articles published on Aug 1, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X