ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించాడు: కోహ్లీపై ట్విట్టర్‌లో ఎవరేమన్నారు?
బర్మింగ్‌హామ్: ఇంగ్లాండ్ గడ్డపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరోచిత సెంచరీని సొంతం చేసుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సహచరులందరూ వరుసగా పెవిలియన్ చేరుతున్నా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లీ 172 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
ఇది కోహ్లీకి ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్ట్ సెంచరీ కాగా.. కెరీర్‌లో 22వ సెంచరీ. అంతేకాదు ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో ఓ భారత కెప్టెన్‌కి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. దీంతో విరాట్ కోహ్లీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అటు టీమిండియా దిగ్గజ ఆటగాళ్ల నుంచి సాధారణ క్రికెట్ అభిమాని వరకు కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కోహ్లీ సెంచరీ సాధించినప్పుడు చేసుకున్న సంబరాలకైతే మ్యాచ్ చూస్తున్న వారంతా ఫిదా అయిపోయారు. మ్యాచ్ ముగించుకుని కోహ్లీ తిరిగి డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తున్న సమయంలో మైదానంలో అభిమానులంతా లేచి చప్పట్లు కొడుతూ అభినందించారు. మరోవైపు కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా గ్యాలరీలో నిల్చుని చప్పట్లు కొడుతూ కనిపించింది.
సచిన్ టెండూల్కర్
"అత్యంత కీలకమైన సమయంలో నీ పోరాటం అమోఘం.. ఈ అద్భుత సెంచరీ సాధించిన నీకు అభినందనలు. ఈ టెస్ట్ సిరీస్‌ను గొప్పగా ఆరంభించారు" అని సచిన్ టెండూల్కర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
వీరేంద్ర సెహ్వాగ్
"కోహ్లీ నుంచి అద్భుత సెంచరీ. 2014లో అతని 10 ఇన్నింగ్స్‌లో సాధించిన పరుగులను ఈ సిరీస్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో సాధించాడు. షమీ, ఇషాంత్, యాదవ్‌లతో 99 పరుగులు జతవ్వగా.. వారి స్కోర్ 8 పరుగులే కాగా.. మిగతావన్నీ కోహ్లియే సాధించడం అద్భుతం" అని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
మహ్మద్ కైఫ్
"వాట్ ఏ ప్లేయర్.. ఒంటి చేత్తో మ్యాచ్‌ను శాసించాడు. కోహ్లి కెరీర్‌లోనే ఇది ఓ గొప్ప సెంచరీ. ఇదో గొప్ప ఇన్నింగ్స్" అని టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు.
ఓ అభిమాని
"నా కల నిజమైంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఆ సందర్భం నన్ను కనువిందు చేసింది. కోహ్లి సెంచరీ సాధించగా.. మ్యాచ్‌కు హాజరైన అనుష్క శర్మ స్టాండ్స్‌లో నుంచి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందిస్తుంటే.. కోహ్లి తమ వెడ్డింగ్ రింగ్ చూపిస్తూ ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిపోయింది" అని ఓ అభిమాని ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications