టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్: కమ్రాన్ అక్మల్ రికార్డు బద్దలు కొట్టిన ధోని


హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుపై కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డు నెలకొల్పాడు.
ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్‌ను స్టంపౌట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్‌గా ధోని అరుదైన రికార్డుని నెలకొల్పాడు. ఇప్పటివరకు పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ పేరిట ఉన్న అత్యధిక స్టంపింగ్‌ల రికార్డుని ధోని బద్దలు కొట్టాడు.

13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 13 ఓవర్లు ముగిసేసరికి కేవలం 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్ 200 పరుగులు చేస్తుందని అంతా భావించారు. కానీ, 14వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ మ్యాజిక్ చేశాడు. కుల్దీప్ యాదవ్ వేసిన తన మూడో ఓవర్‌లో ఇంగ్లండ్‌ను శాసించాడు.

ధోని అద్భుతమైన స్టంపింగ్
ఈ ఓవర్ తొలి బంతికి ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ (7) ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ అందుకోగా.... అ తర్వాత అదే ఓవర్లో మూడో బంతికి ధోని అద్భుతమైన స్టంపింగ్ చేయడంతో జానీ బెయిర్‌స్టో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ స్టంపింగ్‌తో కమ్రాన్ పాక్ వికెట్ కీపర్ అక్మల్ (32 వికెట్లు) పేరిట ఉన్న స్టంపౌట్ల రికార్డును ధోని సమం చేశాడు.

అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపరగా ధోని
ఆ తర్వాత బంతికే జో రూట్‌ను ధోని స్టంపౌట్ చేసి డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ (33) చేసిన వికెట్ కీపరగా ధోని అరుదైన ఘనత సాధించాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్(5/24) బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.

మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యం
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆటగాళ్లలో లోకేశ్ రాహుల్ (101; 54 బంతుల్లో 10 ఫోర్లు, 5సిక్సర్లు) అద్భుత సెంచరీతో రాణించగా, ఓపెనర్ రోహిత్ శర్మ (30; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్సర్) రాణించాడు. కెప్టెన్ కోహ్లీ (8 నాటౌట్) పరుగులతో నిలిచాడు. తాజా విజయంతో మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్లు:
* మహేంద్ర సింగ్ ధోని - 33 స్టంపింగ్స్
* కమ్రాన్ అక్మల్ - 32
* మహ్మద్ షెహజాద్ - 28
* ముష్ఫీకర్ రహీం - 26
* కుమార సంగక్కర - 20
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications