Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: వైభవ్‌కు మళ్లీ నిరాశే.. భారత్ తుది జట్టు ఇదే!

IND vs ENG: ఐర్లాండ్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత టీమిండియా మరో పెద్ద సమరానికి సిద్ధమైంది. బుధవారం చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌లో తలపడేందుకు శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు సర్వం సిద్ధం చేసుకుంది. ఐర్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాజయాన్ని మర్చిపోయి.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో అద్భుతంగా రాణించాలని టీమిండియా భావిస్తోంది. ఇంగ్లాండ్‌లోని పిచ్‌లపై రాణించేందుకు భారత బ్యాటర్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ సేనకు ఓ భారీ గుడ్ న్యూస్ అందింది.

గాయం కారణంగా ఐర్లాండ్ పర్యటనకు దూరమైన టీమిండియా స్టార్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి తిరిగి వచ్చాడు. ఇంగ్లండ్ జట్టుతో జరిగే తొలి టీ20లో వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వస్తే.. గత సిరీస్‌లో ఆడిన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సూర్యన్ష్ షెడ్గేను పక్కన పెట్టే అవకాశం ఉంది. వరుణ్ చక్రవర్తి రాకతో భారత స్పిన్ విభాగం మరింత బలోపేతం కానుంది. మరోవైపు యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు జట్టు యాజమాన్యం మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బ్యాటింగ్ విభాగంలో మాత్రం ఎలాంటి మార్పులు చోటుచేసుకోకపోవచ్చు.

India vs England 1st T20I India Predicted Playing XI out No debut for Vaibhav Sooryavanshi

ఐపీఎల్ 2026లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లోనూ నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తోంది. వైభవ్ సూర్యవంశీ మొదటి టీ20లోనూ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఓపెనింగ్ జోడీగా అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లనే కొనసాగించాలని జట్టు యాజమాన్యం నిర్ణయించింది. ఐర్లాండ్ సిరీస్‌లో సంజూ శాంసన్ ఆశించిన స్థాయిలో రాణించనప్పటికీ.. ఇంగ్లాండ్ సిరీస్‌లో అతను కచ్చితంగా పుంజుకుంటాడని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ తొలి 3 టీ20 మ్యాచ్‌లలో సంజూ శాంసన్ విఫలమైతేనే వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ దక్కుతుంది.

ఇక ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే తమ తుది జట్టును అధికారికంగా ప్రకటించింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ నుండి విశ్రాంతి ఇచ్చింది. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టుకు హ్యారీ బ్రూక్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇరు జట్ల అంచనా తుది జట్లు కింద ఇవ్వబడ్డాయి.

ఇరు జట్ల అంచనా:

భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.

ఇంగ్లాండ్: ఫిల్ సాల్డ్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్.

Story first published: Wednesday, July 1, 2026, 19:23 [IST]
Other articles published on Jul 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+