అరంగేట్రం రోజే చుక్కలు చూపిస్తాం: ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలనం!
IND vs ENG: క్రికెట్ ప్రపంచంలోని అభిమానులందరి కళ్లు టీమిండియా యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రంపైనే ఉన్నాయి. వైభవ్ సూర్యవంశీ ఎప్పుడు బరిలోకి దిగుతాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే జులై 1న జరగబోయే భారత్-ఇంగ్లాండ్ మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వైభవ్ సూర్యవంశీ ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఒకవేళ ఈ మ్యాచ్ ద్వారా వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెడితే.. వైభవ్ సూర్యవంశీని ముందే దెబ్బకొట్టేందుకు తమ బౌలింగ్ విభాగం పూర్తి వ్యూహాలతో సిద్ధంగా ఉందని హ్యారీ బ్రూక్ హెచ్చరించాడు. ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి జట్టులో అవకాశం ఇవ్వనప్పటికీ.. డర్హామ్‌లో జరగబోయే మ్యాచ్‌లో వైభవ్ ఆడతాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.
తెరవెనుక వ్యూహాలు సిద్ధం చేసిన ఇంగ్లాండ్
మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశంలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ అడినా, ఆడకపోయినా తాము రెండు పరిస్థితులకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. "వైభవ్ సూర్యవంశీ తమ అత్యత్తుమ క్రికెట్ ఆడకుండా ఎలా అడ్డుకోవాలో అర్థం చేసుకోవడానికి మా బౌలర్లు తెరవెనుక చాలా కసరత్తులు చేశారు. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాం" అని హ్యారీ బ్రూక్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ ఆత్మవిశ్వాసం చూస్తుంటే అన్నింటికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల ఇండియా-ఏ, శ్రీలంక-ఏ జట్ల మధ్య జరిగిన ముక్కోణపు సిరీస్ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 29 బంతుల్లో 94 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అంతే కాకుండా ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2 దాటలేకపోయినప్పటికీ.. వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనతో పలు అవార్డులను సొంతం చేసుకున్నాడు.

సంజూ ఫామ్ ఆందోళనకరం.. ఓపెనర్లపై శ్రేయస్ అయ్యర్ నమ్మకం
మరోవైపు టీ20 ప్రపంచ కప్ 2026లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన భారత స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ఐర్లాండ్ జట్టుతో జరిగిన మొదటి మ్యాచ్‌లో తక్కువ స్కోరుకే పరిమితమైన సంజూ శాంసన్.. రెండో మ్యాచ్‌లో ఎదుర్కొన్న మొదటి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ లెఫ్టార్మ్ పేసర్ జై ముంద్రా అతడిని పెవిలియన్‌కు పంపాడు. దీనిని ఆసరాగా చేసుకుని ఇంగ్లాండ్ జట్టు సంజూ శాంసన్‌ను ఆరంభంలోనే దెబ్బకొట్టడానికి ల్యూక్ వుడ్ లేదా సామ్ కరన్‌లను రంగంలోకి దించాలని చూస్తోంది. ఇంకో వైపు ఇంగ్లాండ్ జట్టుపై మంచి రికార్డు ఉన్న మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఐర్లాండ్ జట్టుపై రెండో మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన ఓపెనర్లపై పూర్తి నమ్మకం ఉంచాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఈ పర్యటనలో ఖాయమే అయినప్పటికీ.. అది ఈరోజే జరుగుతుందా లేదా అనేది టాస్ పడితేనే తెలుస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications