Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs England: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్.. రోహిత్ ఔట్! సూర్యకుమార్‌కు‌ షాక్!

India vs England 1st T20I: England won the toss and opted to field

అహ్మదాబాద్: సొంతగడ్డపై టీ20 నంబర్‌వన్‌ జట్టు ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సమరానికి టీమిండియా సై అంటోంది. మరికొద్ది సేపట్లో భారత్-ఇంగ్లండ్ మధ్య నరేంద్ర మోడీ మైదానంలో తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చారు. ఇక ముంబై ఇండియన్స్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌కు‌ నిరాశే ఎదురైంది. ఏడాది కాలం తర్వాత భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ ఆడుతున్నాడు. రెండో పేసర్‌గా శార్దూల్ అవకాశం దక్కించుకున్నాడు. సుందర్, అక్షర్, చహల్ మ్యాచ్ ఆడుతున్నారు.

ఇప్పటివరకు భారత్-ఇంగ్లండ్ జట్లు 14 సార్లు టీ20ల్లో తలపడ్డాయి. అయితే ఇరు జట్లు సరిసమానంగా విజయాలు సాధించాయి. 7 సార్లు టీమిండిగా గెలిస్తే.. 7 సార్లు ఇంగ్లండ్ విజయం సాధించింది. అయితే స్వదేశంలో జరిగిన మ్యాచ్‌లలో రెండు జట్లూ ఎక్కువ శాతం గెలిచాయి. కాగా ఇంగ్లండ్, భారత్ కాకుండా బయటి పిచ్‌లపై జరిగిన మ్యాచ్‌లలో మాత్రం ఇంగ్లండ్‌పై భారత్ పూర్తిస్థాయి పైచేయి సాధించింది. 2007లో డర్బన్‌లో జరిగిన టీ20లోనూ, కొలంబోలో 2012లోనూ ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఇక చివరిగా 2018లో ఇంగ్లండ్‌లోని బ్రిస్టోల్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇంగ్లీష్ జట్టు‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది.

మొతేరా పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. మూడు, నాలుగు టెస్టులకు ఉపయోగించిన పిచ్‌తో పోలిస్తే ఈ పిచ్‌ భిన్నంగా ఉండబోతోంది. ఈ ట్రాక్‌పై బ్యాట్స్‌మెన్‌కు పరుగుల పండగ ఖాయం. అయితే ఈ జనవరిలో ముస్తాక్‌ అలీ టోర్నీ ఆడినప్పుడు పిచ్‌ నుంచి స్పిన్నర్లకు సహకారం అందింది. ఇక్కడ ఏడు మ్యాచ్‌లు జరగ్గా.. అయిదింట్లో తొలుత బౌలింగ్‌ చేసిన జట్టే నెగ్గింది. ఈ నేపథ్యంలో టాస్‌ కీలకం అయింది.

తుది జట్లు:
భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), ధావన్, రాహుల్, శ్రేయస్, పంత్, హార్దిక్‌, అక్షర్‌, సుందర్, శార్దుల్, భువనేశ్వర్, చహల్.

ఇంగ్లండ్‌: మోర్గాన్‌ (కెప్టెన్‌), రాయ్, బట్లర్, మలన్, బెయిర్‌స్టో, స్టోక్స్, అలీ, కరన్, జోర్డాన్, ఆర్చర్, మార్క్‌వుడ్, రషీద్‌.

Story first published: Friday, March 12, 2021, 18:54 [IST]
Other articles published on Mar 12, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+