
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా గురువారం జరుగుతున్న తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 198పరుగులు చేసింది. క్రీజులోకి వచ్చిన బ్యాటర్లు వచ్చీ రాగానే బ్యాట్ ఝలిపించడంతో స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఇక దీపక్ హుడా (17బంతుల్లో 33), సూర్యకుమార్ యాదవ్ (19బంతుల్లో 39) దుమ్ముదులుపగా.. హార్దిక్ పాండ్యా (51పరుగులు 32బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఇండియాకు మంచి స్కోరు లభించింది. ఇక ఇంగ్లాండ్ 199పరుగుల టార్గెట్ ఛేదిస్తుందో లేదో చూడాలి.
వికెట్లు పడ్డా శుభారంభమే..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు శుభారంభం దక్కింది. సామ్ కరన్ వేసిన తొలి ఓవర్లోనే ఫోర్ కొట్టి రోహిత్ శర్మ దూకుడు మొదలెట్టాడు. తర్వాత టోప్లే వేసిన రెండో ఓవర్లో రెండు బ్యాక్ టూ బ్యాక్ ఫోర్లు కొట్టి స్కోరు బోర్డు వేగం పెంచాడు. మూడో ఓవర్ మొయిన్ అలీ వేయగా రెండు ఫోర్లు బాది మంచి టచ్‌లో కన్పించిన రోహిత్ (24పరుగులు 14బంతుల్లో 5ఫోర్లు) కీపర్ క్యాచ్ ఔటయ్యాడు. ఇక ఈ మ్యాచ్ ద్వారా టీ20ల్లో కెప్టెన్‌గా 1000పరుగుల మైలురాయిని రోహిత్ అందుకున్నాడు.

దంచికొట్టిన హుడా
ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా.. తన ఫామ్ కొనసాగించాడు. మొయిన్ అలీ వేసిన అయిదో ఓవర్లో బ్యాక్ టూ బ్యాక్ సిక్సులు కొట్టి జోరుకొచ్చాడు. ఇక అదే ఓవర్లో ఇషాన్ కిషన్ (8పరుగులు 10బంతుల్లో) స్వీప్ షాట్ ఆడాలని చూసి క్యాచ్ ఔటయ్యాడు. ఇక వచ్చీ రాగానే సూర్యకుమార్ కుమార్ ఫోర్‌తో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఇక తోప్లే వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో హుడా 3ఫోర్లు కొట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి స్కోరు బోర్డు 2వికెట్లు కోల్పోయి 66పరుగులకు చేరుకుంది.

స్కై ఉన్నంత సేపు దడదడే
ఇక సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా క్రీజులో ధాటిగా ఆడడంతో స్కోరుబోర్డు పరుగులెట్టింది. వీరిద్దరి జోడీకి క్రిస్ జోర్డాన్ బ్రేకులేశాడు. 91పరుగుల వద్ద దీపక్ హుడా (33పరుగులు 17బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) క్యాచ్ ఔట్ అయ్యాడు. ఇక క్రీజులో హార్దిక్ పాండ్యా వచ్చి తన ఆల్రౌండ్ షో కొనసాగించాడు. 10వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి తాను ఇంకా ఫాంలో ఉన్నాననే చూపించాడు. టైమల్ మిల్స్ వేసిన 11ఓవర్లో హార్దిక్ ఓ ఫోర్, స్కై ఓ సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో 15పరుగులొచ్చాయి. ఇక 11ఓవర్లు ముగిసేసరికి స్కోరు 120కి చేరుకుంది. ఇక ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మరోసారి జోర్డాన్ విడగొట్టాడు. సూర్యకుమార్ (39పరుగులు 19బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సులు) ఫుష్ షాట్ ఆడాలని ప్రయత్నించగా గ్లావ్స్ కు తాకి కీపర్ బట్లర్ చేతిలోకి బాల్ వెళ్లగా.. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు కానీ ఇంగ్లాండ్ రివ్యూ తీసుకోవడంతో ఔటయ్యాడు.
టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసిన హార్దిక్
ఇక అనంతరం క్రీజులోకి దినేష్ కార్తీక్‌కు బదులు అక్షర్ పటేల్ వచ్చాడు. ఇక అక్షర్‌తో కలిసి హార్దిక్ పాండ్యా స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలో 14ఓవర్లలోనే 150పరుగులకు ఇండియా చేరుకుంది. ఇక 15ఓవర్లో పార్కిన్సన్ బౌలింగ్లో హార్దిక్ పాండ్యా 37పరుగుల వద్ద స్టంపౌట్ మిస్సయ్యాడు. ఇక వీరిద్దరూ అడపాదడపా ఫోర్లు బాదుతూ రన్ రేట్ పడిపోకుండా చూశారు. ఈ క్రమంలో స్పిన్నర్ పార్కిన్సన్ బౌలింగ్లో అక్షర్ (17పరుగులు 12బంతుల్లో 3ఫోర్లు) క్యాచ్ ఔటయ్యాడు. ఇక అనంతరం సిక్స్ కొట్టి హార్దిక్ పాండ్యా టీ20ల్లో తన తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 30బంతుల్లో 50పరుగులు చేశాడు. ఇక అనంతరం టోప్లే బౌలింగ్లో (51పరుగులు 33బంతుల్లో 6ఫోర్లు 1సిక్సర్) ఔటయ్యాడు. ఇక 18ఓవర్లో టోప్లే 4పరుగులే ఇవ్వగా, 19ఓవర్లో జోర్డాన్ 5పరుగులే ఇవ్వడంతో స్కోరు బోర్డు కాస్త మందగించింది. ఇక చివరి ఓవర్లో దినేష్ కార్తీక్ (11పరుగులు 7బంతుల్లో 2ఫోర్లు) రెండు ఫోర్లు బాది క్యాచ్ ఔట్ అయ్యాడు. తర్వాత హర్షల్ పటేల్ కూడా రనట్ అయ్యాడు. దీంతో ఇండియా 198పరుగులు చేయగలిగింది.
తుది జట్లు
ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్ అండ్ కెప్టెన్), డేవిడ్ మలన్, మొయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, రీస్ టోప్లీ, మాథ్యూ పార్కిన్సన్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్