
హైదరాబాద్: టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లు వేసిన కుల్దీప్ కేవలం 25 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. బ్రిటీష్ పిచ్‌లపై వన్డేల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన తొలి స్పిన్నర్‌గా కుల్దీప్ అరుదైన ఘనత సాధించాడు. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆసీస్ చైనామన్ బౌలర్ బ్రాడ్ హాగ్ రికార్డును తిరగరాశాడు.
తాను వేసిన తొలి ఓవర్లోనే జాసన్ రాయ్ (38) వికెట్ తీసిన కుల్దీప్.. మరుసటి ఓవర్లో రూట్ (3), బెయిర్ స్టో (38)లను పెవిలియన్ చేర్చాడు. 11 బంతుల వ్యవధిలో మూడు వికెట్లు కూల్చడంతో ఇంగ్లండ్ 82/3గా నిలిచింది. చివరి పది ఓవర్లలో కుల్దీప్ మరోసారి మాయ చేశాడు. స్టోక్స్, బట్లర్‌ను పెవీలియన్ చేర్చాడు. కాసేపటికే డేవిడ్ విల్లే (1)ను కూడా ఔట్ చేపి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.
ఇది కుల్దీప్ వన్డే కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కావడం మరో విశేషం. కుల్దీప్ చేసిన మాయపై సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. "అరే ఏం బౌలింగ్.. కుల్దీప్ టాప్ 5 గొప్ప ప్రదర్శనలన్నీ ఓవర్సీస్‌లోనివే. కట్టప్పా.. బహుబలిని ఎలా చంపిండో తెలిసిపోయింది కానీ.. కుల్దీప్ ఆట మాత్రం ఇంగ్లాండ్‌కు అర్థం కావడం లేదు" అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.