Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్, రోహిత్ కాదు.. ఇంగ్లాండ్ ఈ ఆటగాడిని చూసి గజగజ వణికిపోతోంది!

IND vs ENG: ఈ రోజు ఇంగ్లాండ్ జట్టుకు కష్టాలు తప్పవు.. అనే కృతనిశ్చయంతో టీమిండియా బరిలోకి దిగాలి. టీ20 సిరీస్‌లో ఎదురైన ఘోర పరాజయానికి ఇప్పుడు వన్డే సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలి. టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి బరిలోకి దిగనున్నారు. కానీ ఇంగ్లాండ్ వీరిద్దరి కంటే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకే ఎక్కువగా భయపడాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత వన్డే ఫార్మాట్లో సింహం వేటకు సిద్ధమవుతోంది. మొత్తంగా భారత జట్టు ఇంగ్లాండ్‌పై త్రిముఖ దాడికి దిగబోతోంది.

IND vs ENG: బ్రిటీష్ సేనకు దవడ పగిలే కౌంటర్: వన్డే సిరీస్ మనదే రాసిపెట్టుకోండి!

IND vs ENG: బ్రిటీష్ సేనకు దవడ పగిలే కౌంటర్: వన్డే సిరీస్ మనదే రాసిపెట్టుకోండి!

968 రోజుల తర్వాత తిరిగొచ్చిన జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లాండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు భయపడాలి. బర్మింగ్‌హామ్‌లో ప్రత్యర్థిని తన ఇష్టానుసారం ఆడించగల సత్తా జస్ప్రీత్ బుమ్రాకు ఉంది. బుమ్రా బౌలింగ్‌లో ఆతిథ్య జట్టు బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలితే ఆశ్చర్యపోనవసరం లేదు. ఆసక్తికరంగా జస్ప్రీత్ బుమ్రా 2023 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత వన్డే ఫార్మాట్లో ఆడనున్నాడు. అంటే 968 రోజుల తర్వాత జస్ప్రీత్ బుమ్రా వన్డే ఫార్మాట్లో బంతితో తిరిగి రానున్నాడు. గణాంకాల ప్రకారం.. జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్‌లో ఆడిన 9 వన్డేలలో 14 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా టెస్ట్ ఫార్మాట్లో జస్ప్రీత్ బుమ్రా 12 మ్యాచ్‌లలో 22 ఇన్నింగ్స్‌ల్లో 51 మంది బ్యాటర్లను ఔట్ చేశాడు.

India vs England 1st ODI England Should Afraid of Jasprit Bumrah Not Virat Kohli and Rohit Sharma

రో-కోపైనే అందరి దృష్టి
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల జోడి ఇంగ్లాండ్ పరిస్థితులలో కూడా అద్భుతంగా రాణించగలదు. ఇంగ్లాండ్‌లో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు కూడా ఉంది. విరాట్ కోహ్లీ 33 వన్డేలలో 51 సగటుతో 1349 పరుగులు చేశాడు. ఈ కాలంలో విరాట్ కోహ్లీ 2 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు సాధించాడు. మరోవైపు రోహిత్ శర్మ 27 వన్డేలలో 64 సగటుతో 1428 పరుగులు చేశాడు. ఈ హిట్‌మ్యాన్ 7 సెంచరీలు, అంతే సంఖ్యలో హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. ఈ గణాంకాలను చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. 'రో-కో' జోడి ఇంగ్లాండ్‌లో విధ్వంసం సృష్టించబోతోంది.

IND vs ENG: ఆ తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ఇంగ్లండ్ కెప్టెన్

IND vs ENG: ఆ తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: ఇంగ్లండ్ కెప్టెన్

ముఖాముఖి రికార్డు ఇలా?
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ముఖాముఖి గణాంకాలలో కూడా టీమిండియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఇప్పటివరకు 110 వన్డేలు జరగగా.. వాటిలో టీమిండియా 61 సార్లు గెలుపొందగా.. ఇంగ్లాండ్ 44 సార్లు విజయం సాధించింది. జులై 14న ఎడ్జ్‌బాస్టన్‌లో ఓ జట్టు గెలుస్తుందో చూసేందుకు క్రికెట్ అభినాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి వన్డే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.

Story first published: Tuesday, July 14, 2026, 10:51 [IST]
Other articles published on Jul 14, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+