Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Bangladesh: బుమ్రా, అశ్విన్‌ల రికార్డు బద్దలు కొట్టిన యజువేంద్ర చాహల్

India vs Bangladesh: Yuzvendra Chahal beats Bumrah, Ashwin to become fastest Indian to take 50 T20I wickets

హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా ఆదివారం బంగ్లాదేశ్‌తో ముగిసిన ఆఖరి టీ20లో చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 50 వికెట్లను అందుకున్న బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ రికార్డుని అధిగమించాడు.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో మహ్మదుల్లా వికెట్‌ను తీయడం ద్వారా చాహల్ ఈ మైలురాయిని అందుకున్నాడు. భారత్ తరుపున ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా చాహల్ నిలిచాడు. అంతకముందు ఈ మైలురాయిని అందుకున్న బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఉన్నారు.

అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో

అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో

అంతర్జాతీయ టీ20ల్లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్‌(52) అగ్రస్థానంలో ఉండగా, జస్ప్రీత్ బుమ్రా(51) వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకుంది మాత్రం చాహలే. ఈ మైలురాయిని అందుకునేందుకు చాహల్‌కు 34 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా... జస్ప్రీత్ బుమ్రా(42), రవిచంద్రన్ అశ్విన్(46) ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించారు.

బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను ఇరకాటంలో పెట్టిన చాహల్

బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను ఇరకాటంలో పెట్టిన చాహల్

ఈ సిరిస్‌‌లో చాహల్ తన స్పిన్‌తో బంగ్లాదేశ్ బౌలర్లను బాగానే ఇరకాటంలో పెట్టాడు. ఢిల్లీ వేదికగా బంగ్లాతో జరిగిన తొలి టీ20లో వికెట్‌ తీసిన చాహల్‌ రాజ్ కోట్ వేదికగా ముగిసిన రెండో టీ20లో రెండు వికెట్లు సాధించాడు. మూడో టీ20లో నాలుగు ఓవర్లు వేసిన చాహల్ ఒక వికెట్ తీసి 43 పరుగులు ఇచ్చాడు.

మూడో టీ20లో చాహల్ నెలకొల్పిన రికార్డులివే

మూడో టీ20లో చాహల్ నెలకొల్పిన రికార్డులివే

* టీ20ల్లో భారత్ తరుపున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చాహల్ నిలిచాడు.

* టీ20ల్లో భారత్ తరుపున 50 వికెట్లు తీసిన మూడో బౌలర్.

* అజంతా మెండిస్, ఇమ్రాన్ తాహిర్, రషీద్ ఖాన్, ముస్తాఫిజుర్ రెహ్మన్‌ల తర్వాత అత్యంత వేగంగా టీ20ల్లో 50 వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్ నిలిచాడు.

Story first published: Monday, November 11, 2019, 17:37 [IST]
Other articles published on Nov 11, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+