
రాయుడు విఫలం:
ఐపీఎల్-12కు ముందు జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో రాయుడు పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డాడు. ఇక ఐపీఎల్-12లో చెన్నై తరపున కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదే సమయంలో పంజాబ్ తరపున పరుగుల వరద పారిస్తూ కేఎల్ రాహుల్ ఆకట్టుకున్నాడు. దీంతో ప్రపంచకప్ జట్టు నాలుగో స్థానంలో విజయ్ శంకర్, కేఎల్ రాహుల్‌లను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. దినేష్ కార్తీక్ కూడా వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యాడు. ఈ ముగ్గురు రేసులో ఉన్నా.. నం.4లో ఎవరు ఆడుతారో అని కెప్టెన్ కోహ్లీ, కోచ్ స్పష్టత ఇవ్వలేదు.

మెరుపు శతకం
నం.4లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు విజయ్ శంకర్. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లకు ముందు శంకర్ గాయపడడంతో.. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అవకాశం దక్కించుకున్నాడు. అయితే 10 బంతులు ఆడి 6 పరుగులు చేసి బోల్డ్ అయ్యాడు. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా రాహుల్ నం.4లోనే వచ్చాడు. స్వల్ప స్కోరుకే నాలుగు వికెట్లు పడిన దశలో అతడు ఎంఎస్ ధోనీతో కలిసి భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలోనే రాహుల్ 94 బంతుల్లో (108; 99 బంతుల్లో 12×4, 4×6)మెరుపు శతకం చేసాడు. మరోవైపు శంకర్ (2) విఫలమయ్యాడు.

ఉత్కంఠ వీడింది:
రాహుల్ తన ప్రదర్శనతో.. నం.4లో ఎంతో కాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరదింపాడు. నాలుగో స్థానంలో కేఎల్ రాహుల్ శతకం బాదడం జట్టుకు పెద్ద ఊరట. విజయ్ శంకర్‌ను పక్కన పెట్టి దక్షిణాఫ్రికాతో జరిగే ఆరంభ మ్యాచ్‌లో రాహుల్ నెంబర్ 4లో బరిలోకి దిగడం దాదాపు ఖాయం అయింది. మరోవైపు నాలుగో స్థానంలో రాహుల్‌ను ఆడించాలని కెప్టెన్‌తో పాటు టీం మేనేజిమెంట్ భావిస్తోందని సమాచారం తెలుస్తోంది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ ముందు రాహుల్ భారీ స్కోర్ చేసి టచ్‌లోకి రావడంతో అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు. రాహుల్‌నే నం.4లో ఆడించాలని అంటున్నారు. నాలుగో స్థానం రాహుల్‌దే అని అందరూ ఫిక్స్ అయ్యారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications












