బుమ్రా యార్కర్.. ఆశ్చర్యంలో షకీబ్ (వీడియో)

స్ట్రయిట్ యార్కర్లు వేయడం భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు వెన్నతో పెట్టిన విద్య. తన యార్కర్లతోనే మేటి బ్యాట్స్‌మన్‌ను సైతం బోల్తా కొట్టిస్తుంటాడు. గత కొంత కాలంగా భారత్ డెత్ ఓవర్లలో బాగా రాణిస్తుందంటే కారణం జస్ప్రీత్ బుమ్రా. తాజాగా ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్‌లో సైతం డేంజరస్ బ్యాట్స్‌మన్ షేన్ వాట్సన్ ను కూడా పరుగులు చేయనివ్వలేదు. బుమ్రా స్పెల్ కారణంగానే ఓటమి అంచులో ఉన్న ముంబై.. రేసులోకి వచ్చింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
అయితే బ్యాట్స్‌మన్‌లను యార్కర్లతో బెంబేలెత్తించే బుమ్రా.. మరోసారి తన మార్క్ చూపించాడు. ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్‌లలో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో భారత్ రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 10వ ఓవర్ ఇదో బంతికి బంగ్లా ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ను 'సూపర్ యార్కర్'తో పెవిలియన్ చేర్చాడు. బుమ్రా వదిలిన బంతికి షకీబ్ ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. బుమ్రా దెబ్బకు షకీబ్ గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. దీనికి సంబందించిన వీడియోను ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బుమ్రాపై అభిమానులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి.
బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఎంఎస్ ధోనీ (113; 78 బంతుల్లో 8×4, 7×6), కేఎల్ రాహుల్ (108; 99 బంతుల్లో 12×4, 4×6) శతకాలతో అదరగొట్టడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 359 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారత బౌలర్ల దాటికి బంగ్లా తడబడి 95 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications