Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫోటోలు: ఫ్యాన్స్‌ని నిరాశకు గురి చేసిన కోహ్లీ

హైదరాబాద్: నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఎంతోగానో అలరించింది. టీమిండియా కెప్టెన్ కోహ్లీ సైతం ఇదే విషయాన్ని వెల్లడించాడు. 'ఐదు రోజుల పాటు ఇక్కడ ప్రేక్షకుల స్పందన అద్భుతం. పెద్ద సంఖ్యలో అభిమానులు మా ఆటను చూసేందుకు ఇక్కడికి వచ్చారు. వారికి కావాల్సిన వినోదాన్ని మేం అందించాం' అని మ్యాచ్ అనంతరం కోహ్లీ వ్యాఖ్యానించాడు.

చిన్నారులకు కోహ్లీ ఆటోగ్రాఫ్‌లు

చిన్నారులకు కోహ్లీ ఆటోగ్రాఫ్‌లు

మ్యాచ్ ముగిసిన అనంతరం ఇద్దరు అమ్మాయిలు కోహ్లీ వద్దకు వచ్చి చిన్న బ్యాట్‌పై ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. కోహ్లీ ఆటోగ్రాఫ్ దొరకడంతో ఆ అమ్మాయిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌లో చివరి రోజైన సోమవారం 9520 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.

ఉప్పల్ స్టేడియంలోని ప్రేక్షకుల ఆనందం

ఉప్పల్ స్టేడియంలోని ప్రేక్షకుల ఆనందం

సెలవు రోజులైన శని, ఆదివారాల్లో 20 వేల పైచిలుకు దాటగా ఐదో రోజు సగానికి తగ్గింది. ఆఖరి రోజు 459 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను భారత బౌలర్లు మెరుగ్గా రాణించి రెండు సెషన్లలోనే అవుట్ చేయడంతో ప్రేక్షకుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

నిరాశకు గురి చేసిన కోహ్లీ స్పందన

నిరాశకు గురి చేసిన కోహ్లీ స్పందన

సోమవారం మ్యాచ్‌ త్వరగా ముగియడంతో ట్రోఫీ ఇచ్చేంత వరకూ అభిమానులు గ్యాలరీలోనే ఉన్నారు. అయితే చివరి రోజు తమ పట్ల కోహ్లీ స్పందించిన తీరు మాత్రం అభిమానులను నిరాశకు గురి చేసింది. మ్యాచ్‌ గెలిచాక తిరిగి వస్తున్న సమయంలో సౌత్‌ స్టాండ్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రేక్షకులు ‘కోహ్లీ... కోహ్లీ... కోహ్లీ' అంటూ అరుస్తున్నా అతను కనీసం వారి వైపు కూడా తిరిగి చూడలేదు.

ఊపిరి పీల్చుకున్నన్న మ్యాచ్ నిర్వాహకులు

ఊపిరి పీల్చుకున్నన్న మ్యాచ్ నిర్వాహకులు

మరోవైపు బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌ సజావుగా ముగియడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. ఆటగాళ్లు, సిబ్బంది, హెచ్‌చ్‌సీఏ ప్రతినిధులు ఒకరినొకరు అభినందించుకున్నారు. మ్యాచ్‌కు పర్యవేక్షకుడిగా వచ్చిన బీసీసీఐ జనరల్‌ మేనేజర్‌ (గేమ్‌ డెవల్‌పమెంట్‌) రత్నాకర్‌ శెట్టి హెచ్‌సీఏ సభ్యులతో కరచాలనం చేసి అభినందించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+