Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

షర్ట్ విప్పి మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. ప్రేమగా మాట్లాడిన కోహ్లీ (వీడియో)

India vs Bangladesh, 1st Test : 'Kohli Fan' Sneaks Onto The Field During The First Test In Indore
India vs Bangladesh: Virat Kohli Saves Pitch Invader From Security Personnel In Indore

ఇండోర్: కెరీర్ ఆరంభం నుండి పరుగుల వరద పారించే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అబిమానులు ఉంటారు. కొందరు ఫాన్స్ కోహ్లీని ఒక్కసారి కలవాలని, అతనితో మాట్లాడాలని, సెల్ఫీ దిగాలని కలలు కంటుంటారు. ఇక పిచ్చి అభిమానం ఉండే ఫాన్స్.. పోలీసుల భద్రతా వలయం, బారీకేడ్లు దాటుకొని మరీ పరిగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చి కోహ్లీని కలుస్తుంటారు. అటువంటి ఘటనే శనివారం తొలి టెస్టులో జరిగింది.

మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని:

మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని:

భారత్×బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో శనివారం విరాట్ కోహ్లీ కోసం సూరజ్‌ అనే అభిమాని షర్ట్ విప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. మ్యాచ్‌ మధ్యలో వచ్చిన బ్రేక్‌తో ఆటగాళ్లు, అంపైర్లు మాట్లాడుకుంటుండగా.. బారికేడ్లను దాటి సెక్యూరిటీ నుంచి తప్పించుకొని పరిగెత్తుకుంటూ కోహ్లీ దగ్గరికి చేరుకున్నాడు. దాంతో ఇషాంత్‌ శర్మ కాస్త కంగారుపడ్డాడు.

వీరాభిమానిని కాపాడిన కోహ్లీ:

వీరాభిమానిని కాపాడిన కోహ్లీ:

ఇది గమనించి అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది బలవంతంగా మైదానం నుంచి సూరజ్‌ను బయటకు పంపించడానికి ప్రయత్నించారు. కానీ.. కోహ్లీ అలా చేయొద్దని సిబ్బందికి సంకేతాలు ఇచ్చాడు. కొద్దిసేపు సూరజ్‌ భుజంపై చేయి వేసి ముచ్చటించాడు. అభిమాన క్రికెటర్‌తో మాట్లాడిన సూరజ్‌ సంతోషంగా కనిపించాడు. అనంతరం అక్కడి సిబ్బంది అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.

దటీజ్‌ కోహ్లీ:

దటీజ్‌ కోహ్లీ:

ఒకవేళ కోహ్లీ అలా చెప్పకుండా ఉంటే.. సూరజ్‌ చేసిన పనికి పోలీసులు బాగానే బుద్దిచెప్పేవారు. ఈ ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వీరాభిమానిని కాపాడిన విరాట్ కోహ్లీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. 'దటీజ్‌ కోహ్లీ' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'ఆటలోనే కాదు.. మంచి పనులతోనూ ఆకర్షిస్తన్నాడు' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు.

చేతిపై పచ్చబొట్టు:

చేతిపై పచ్చబొట్టు:

ఉత్తరాఖండ్‌కు చెందిన సూరజ్‌ వంటపని చేస్తుంటాడని ఇండోర్ పోలీసు అధికారి వెల్లడించాడు. కోహ్లీకి సూరజ్‌ వీరాభిమాని అని తెలిపాడు. కోహ్లీ పేరును తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. అంతేకాకుండా శరీరంపై రంగులతో 'వీకే' అని రాసుకున్నాడని సదరు అధికారి తెలిపాడు.

అభిమానులే స్ఫూర్తి:

తొలి టెస్టులో బంగ్లాపై భారత్‌ ఇన్నింగ్స్‌ 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కోల్‌కతా వేదికగా రెండో టెస్టు నవంబర్‌ 22న ప్రారంభం కానుంది. మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ... స్టేడియానికి వచ్చి అభిమానులే స్ఫూర్తి, వారు ప్రోత్సహించడంతో రెట్టింపు ఉత్సాహంగా ఆడి విజయం సాధించాం' అని పేర్కొన్నాడు.

Story first published: Sunday, November 17, 2019, 12:53 [IST]
Other articles published on Nov 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+