బంగ్లాతో సిరిస్: కోహ్లీకి విశ్రాంతి!, రేసులో ఉన్న యువ క్రికెటర్లు వీరే!

హైదరాబాద్: భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన ముగిసింది. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో 3 టీ20లు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. బంగ్లాదేశ్‌తో సిరిస్ నుంచి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా విరాట్ కోహ్లీ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా, బంగ్లాదేశ్ క్రికెటర్లు తమ సమ్మెను విరమించడంతో భారత పర్యటనకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు జట్టుని ఎంపిక చేసేందుకు గాను ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ గురువారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలనే సెలక్టర్లు చూస్తున్నారు.

విరాట్ కోహ్లీకి విశ్రాంతి!
వరల్డ్‌కప్ తర్వాత నుంచి విరాట్ కోహ్లీ విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీకి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. కోహ్లీ సైతం విశ్రాంతి తీసుకునేందుకు మొగ్గుచూపితే విశ్రాంతి తప్పనిసరి. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో చివరి రెండు వన్డేలతో పాటు టీ20 సిరీస్‌లో కోహ్లి చివరగా విశ్రాంతి తీసుకున్నాడు.

ధోని భవితవ్యంపై నిర్ణయం!
వరల్డ్‌కప్ అనంతరం రెండు నెలలు పాటు విరామం తీసుకున్న ధోనీని ఎంపిక చేస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరిస్‌కు ధోని గనుక ఆడతానని చెబితే సెలక్టర్లు అతడిని ఎంపిక చేయడం ఖాయం. ఇదే గనుక జరిగితే ధోనికి ఇదే చివరి సిరిస్ అవుతుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సౌరవ్ గంగూలీ సైతం ధోనికి మద్దతుగా నిలిచాడు.

యశస్వి జైస్వాల్‌కు చోటు దక్కుతుందా?
ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించిన ముంబై యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌ను బంగ్లా సిరిస్‌కు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. లిస్ట్-ఏ క్రికెట్‌లో పిన్నవయసులో డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్‌గా యశస్వి రికార్డు నెలకొల్పడంతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించారు. మరో యువ క్రికెటర్ శివం దూబే పేరును కూడా పరిశీలిస్తున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో దూబే సెంచరీ చేయడంతో వెలుగులోకి వచ్చాడు.

సంజూ శాంసన్‌కు అవకాశం
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్‌కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన రిషబ్ పంత్ స్థానంలో బ్యాకప్ కీపర్‌గా మరో యువ క్రికెటర్ సంజూ శాంసన్‌ను బంగ్లాదేశ్ సిరీస్‌కు ఎంపిక చేసేందుకు సెలక్టర్లు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో సంజూ శాంసన్ మొత్తం 410 పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications