
మెయిన్ టార్గెట్ కోహ్లీ:
ఢిల్లీ పోలీసులు అనామక లేఖని బీసీసీఐ సెక్యూరిటీ ఏజెన్సీకి పంపి జట్టు భద్రతని సమీక్షించుకోవాలని సూచించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మ్యాచ్‌ని చూసేందుకు వచ్చే రాజకీయ ప్రముఖులు తమ మెయిన్ టార్గెట్ అని ఆ లేఖలో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఆల్ ఇండియా లష్కర్ ముఠా నుండి ఈ లేఖ అందినట్టు తెలుస్తోంది.

పటిష్ట భద్రత:
ఉగ్ర ముప్పు నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు భద్రతను కట్టుదిట్టం చేయాలని భారత హోంమంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసులను బీసీసీఐ కోరింది. ఇప్పటి నుండే పోలీసులు భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుని జట్టుకు దూరంగా ఉన్న కోహ్లీ భద్రతపైనా అధికారులు దృష్టి సారించారు. అలానే భారత్ జట్టు సీనియర్ ఆటగాళ్ల భద్రతనీ సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

లిస్టులో ప్రధాని మోడీ:
ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు రామ్ నాథ్ కోవింద్, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా మరియు స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పేర్లు కూడా లేఖలో ఉన్నాయట. అందరిలో విరాట్ కోహ్లీనే మెయిన్ టార్గెట్ చేసినట్టు సమాచారం.

వెస్టిండీస్ పర్యటనలో కూడా బెదిరింపు మెయిల్:
భారత్ జట్టు ఇటీవల వెస్టిండీస్ పర్యటనకి వెళ్లిన సమయంలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుపై దాడులు జరపబోతున్నామని ఓ మెయిల్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కు వచ్చింది. పీసీబీ వెంటనే ఆ మెయిల్‌ను ఐసీసీకి పంపించింది. మరోవైపు బీసీసీఐకి కూడా అలాంటి మెయిలే రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజాగా మరోసారి అలాంటి హెచ్చరికే వచ్చింది. అయితే వ్యవహారం ఈసారి మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications
