బంగ్లాతో ఏకైక టెస్టు మ్యాచ్: సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఒక సీజన్లో భారత గడ్డపై అత్యధిక స్కోరు చేసిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డుని అధిగమించాడు. బంగ్లా టెస్టులో 144 పరుగులు చేయడంతో కోహ్లీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
నగరంలోని ఉప్పల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ రెండో రోజైన శుక్రవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో బంగ్లా బౌలర్ షకీబ్ ఉల్ హాసన్ వేసిన బంతిని బౌండరీకి తరలించడంతో కోహ్లీ... సెహ్వాగ్ పేరిట ఉన్న రికార్డుని అధిగమించాడు. బంగ్లాతో జరుగుతున్న టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీకి చేరువలో ఉన్నాడు.

2004-05 సీజన్లో 1105 పరుగులు చేసిన సెహ్వాగ్
2004-05 సీజన్లో వీరేంద్ర సెహ్వాగ్ 17 మ్యాచ్ లాడి 4 సెంచరీలు, మూడు అర్ధసెంచరీలతో 1105 పరుగులు చేశాడు. అంతేకాదు కోహ్లీ టెస్టుల్లో తానాడిన ప్రతి ప్రత్యర్థి జట్లపై సెంచరీ సాధించాడు. ఇప్పటివరకూ ఆరు టెస్ట్ హోదా జట్లపై సెంచరీ బాదిన కోహ్లీ, తాజాగా గురువారం బంగ్లాపై సెంచరీతో తాను ఆడిన ఏడు టెస్ట్ హోదా దేశాలపై సెంచరీ చేసిన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఏడు టెస్ట్ హోదా దేశాలపై సెంచరీ చేసిన కోహ్లీ
కాగా, టెస్టు హోదా ఉన్న పాకిస్తాన్, జింబాబ్వే జట్లపై కోహ్లీ టెస్టు మ్యాచ్‌లు ఇప్పటివరకు ఆడలేదు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ టెస్టులో తొలిరోజు పుజారా అవుటైన వెంటనే బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ బంగ్లాదేశ్ బౌలర్ ఇస్లాం వేసిన 66వ ఓవర్‌లో సింగిల్స్ తీసి 2016/17 సీజన్‌లో 1000 పరుగులు చేసిన తొలి భారత కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు.

1000 పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ ఏడో వాడు
అదేవిధంగా కెప్టెన్‌గా ఒక సీజన్‌లో 1000 పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ ఏడో వాడు కావడం విశేషం. గతంలో పాంటింగ్ (1,483), లారా (1,253), క్లార్క్ (1,178, 1,141) గ్రేమ్ స్మిత్(1,107) గ్రహమ్ గూచ్ (1,058), బాబ్ సిమ్సన్ (1,007) ఒకే సీజన్‌లో వెయ్యికి పైగా పరుగులు చేశారు.

భారత్ తరుపున చూస్తే ఏడవ ఆటగాడు
ఇక, భారత్ తరుపున చూస్తే ఏడవ ఆటగాడిగా కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. అంతక ముందు గౌతమ్ గంభీర్ (1,269), రాహుల్ ద్రవిడ్ (1,241, 1,006), మోహిందర్ అమర్‌నాథ్(1,182), గవాస్కర్ (1,179, 1,027), వీరేంద్ర సెహ్వాగ్ (1,128, 1,079) ఒకే సీజన్‌లో వెయ్యికి పైగా పరుగులు చేశారు.

ఒక సీజన్‌లో టెస్టుల్లో 1000కి పైగా పరుగులు చేసిన ఆటగాళ్లు:
1105 - వీరేంద్ర సెహ్వాగ్ (2004/05)
1027 - సునీల్ గవాస్కర్ (1978/79)
1000 runs - విరాట్ కోహ్లీ (2016/17)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications