Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 Asia Cup 2024 Final: భారత్ X బంగ్లాదేశ్ ఫైనల్... ఫ్రీగా ఎలా చూడాలంటే?

అండర్ 19 ఆసియా కప్ 2024 తుదిపోరుకు రంగం సిద్దమైంది. దుబాయ్ వేదికగా భారత్- బంగ్లాదేశ్‌ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 10.30 గంటలకు టైటిల్ పోరు ప్రారంభం కానుంది. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన యువ భారత్.. పాకిస్థాన్ చేతిలో ఓటమి మినహా మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్‌లో ఆల్‌రౌండ్ షోతో విజయ ఢంకా మోగించింది.

మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ శ్రీలంక చేతిలో పరాజయాన్ని మినహా, మిగిలిన మూడింట్లోనూ నెగ్గింది. పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి వరుసగా రెండోసారి ఫైనల్స్‌కు చేరింది. ఓవరాల్‌గా బంగ్లాదేశ్ ఇది మూడో ఫైనల్. 2019లో రన్నరప్‌గా నిలిచింది. యువ భారత్ ఎనిమది సార్లు టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అన్నింట్లోనూ విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.

India vs Bangladesh U19 Asia Cup 2024 Final Live Streaming Details When and Where to Watch

1989, 2003, 2012, 2013/14, 2016, 2018, 2019, 2021‌లో యువ భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. 1989 నుంచి జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో ఇండియా 8 సార్లు విజేతగా నిలవగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ ఒక్కోసారి టైటిల్‌ను గెలిచింది. అయితే గత అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో బంగ్లా చేతిలో యువ భారత్ ఓటమిపాలైంది. ఈ మెగాటోర్నీలో బంగ్లాను చిత్తుచేసి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.

ఫ్రీగా ఎలా చూడాలంటే..
అండర్ 19 ఆసియాకప్ టోర్నీ బ్రాడ్‌కాస్టింగ్ ఇండియా రైట్స్ సోనీ నెట్‌వర్క్‌కు ఉన్నాయి. సోనీకి చెందిన ఛానెల్స్‌తో పాటు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీలివ్‌లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ ఫైనల్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. సోనీ టీవీ ఛానెల్స్, సోనీ లీవ్ సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కానీ జియో, ఎయిర్టెల్ యూజర్స్ టైటిల్ పోరును ఫ్రీగా చూడవచ్చు. జియో టీవీ, ఎయిర్టెల్ టీవీ యాప్‌లో సోనీ టెన్ ఛానెల్స్‌ను ఎంచుకొని ఫైనల్‌ ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.

జట్లు:
భారత్: ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రీ సిద్దార్థ్, మహమ్మద్ అమన్(కెప్టెన్), కిరణ్ కోర్మాలే, ప్రణవ్ పంత్, హర్వన్ష్ సింగ్ పంగాలియా(వికెట్ కీపర్), అనురాగ్, హార్దిక్ రాజ్, మహమ్మద్ ఇనాన్, కేపీ కార్తీకేయ, సమర్థ్ నాగ్‌రాజ్, యుధజిత్ గుహ, చేతన్ శర్మ, నిఖిల్ కుమార్

బంగ్లాదేశ్ : జవాద్ అబ్రార్, కలాం సిద్ధికి అలీన్, అజీజుల్ హకీమ్ తమీమ్ (కెప్టెన్), మహ్మద్ షిహాబ్ జేమ్స్, ఫరీద్ హసన్ ఫైసల్ (వికెట్ కీపర్), దేబాసిష్ సర్కార్ దేబా, రఫీ ఉజ్జామాన్ రఫీ, సమియున్ బసిర్ రతుల్, మరుఫ్ మృధా, అల్ ఫహద్, ఇక్బాల్ హుస్సేన్ ఎమోన్, రిజాన్ హొసన్, అష్రఫుజ్జమాన్, రిఫత్ బేగ్, సాద్ ఇస్లాం రజిన్.

Story first published: Saturday, December 7, 2024, 11:09 [IST]
Other articles published on Dec 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+