For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

U19 Asia Cup 2024 Final: చెలరేగిన భారత బౌలర్లు!

దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌ ఫైనల్‌లో యువ భారత్ బౌలర్లు చెలరేగారు. మన బౌలర్లు సమష్టిగా సత్తాచాటడంతో బంగ్లా 49.1 ఓవర్లలో 198 పరుగులకు ఆలౌటైంది. రిజాన్ హొస్సేన్ (47; 65 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. మహ్మద్ షిహాబ్ జేమ్స్ (40; 67 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), ఫరీద్ హసన్ ఫైసల్ (39; 49 బంతుల్లో, 3 ఫోర్లు) పరుగులు చేశారు.

యుధజిత్ గుహా (2/29), చేతన్ శర్మ (2/42), హార్దిక్ రాజ్ (2/41) తలో మూడు వికెట్లు తీశారు. కిరణ్ (1/19), కార్తికేయ (1/37), ఆయుష్ (1/9) తతో వికెట్ తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కలామ్ సిద్ధిఖి (1; 16)ని యుధజిత్ క్లీన్ బౌల్డ్ చేశాడు. చేతన్, కిరన్ కూడా వికెట్ల వేట ప్రారంభించడంతో జవాద్ అబ్రార్ (20; 35 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ అజిజుల్ హకీమ్ (16; 28 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) కూడా ఆదిలోనే పెవిలియన్‌కు చేరారు.

India vs Bangladesh U19 Asia Cup 2024 Final India Bowlers Shine as They Restrict Bangladesh to 198

66/3తో కష్టాల్లో నిలిచిన బంగ్లాను షిహాద్‌తో కలిసి రిజాన్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం భారత బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ బంగ్లాను దెబ్బకొట్టారు. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా మరోవైపు ఫరీద్ నిలకడగా ఆడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపిస్తూ భారత్ ముందు పోరాడే స్కోరు ఉంచాడు.

Story first published: Sunday, December 8, 2024, 15:10 [IST]
Other articles published on Dec 8, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+