For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బంగ్లాతో ఏకైక టెస్టు: తొలి రోజు స్టాటస్టికల్ హైలెట్స్ ఇవే

కెప్టెన్ విరాట్ కోహ్లీ (111), మురళీ విజయ్ (108) ఇన్నింగ్స్‌కు తోడు పుజారా (83) నిలకడగా ఆడడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 90 ఓవర్లలో 3 వికెట్లకు 356 పరుగులు చేసింది. 

By Nageshwara Rao

హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో గురువారం ప్రారంభమైన ఏకైక టెస్టులో టీమిండియా చెలరేగిపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (111), మురళీ విజయ్ (108) ఇన్నింగ్స్‌కు తోడు పుజారా (83) నిలకడగా ఆడడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి టీమిండియా 90 ఓవర్లలో 3 వికెట్లకు 356 పరుగులు చేసింది.

తొలి రోజు ఆట ముగిసే సరికి కోహ్లీ 111, రహానే (45 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో టస్కిన్, మిరాజ్, ఇస్లాం తలో వికెట్ తీసుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను ఆరంభంలో బంగ్లా బౌలర్లు బాగా కట్టడి చేశారు. పేసర్ టస్కిన్ ఇన్నింగ్స్ నాలుగో బంతికే రాహుల్ (2)ను ఔట్ చేసి షాకిచ్చాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పుజారా (83) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. విజయ్‌తో రెండో వికెట్‌కు 178 పరుగులు జోడించి గట్టి పునాది వేశాడు. ఆపై, కోహ్లీ తనదైన దూకుడుతో చెలరేగాడు. రహానె (60 బంతుల్లో 7 ఫోర్లతో 45 బ్యాటింగ్‌)తో నాలుగో వికెట్‌కు అజేయంగా 122 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.

52 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేసిన పుజారా

52 ఏళ్ల రికార్డు బ్రేక్‌ చేసిన పుజారా

ఓ ఫస్ట్‌క్లాస్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా పుజారా రికార్డు సృష్టించాడు. సెంచరీకి 17 పరుగుల దూరంలో నిలిచిపోయినప్పటికీ దేశవాళీ చరిత్రలో 52 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేశాడు. 2016-17 సీజన్‌లో అతడు 21 ఇన్నింగ్స్‌ల్లో 89.16 సగటుతో 1605 పరుగులు చేశాడు. చందు బోర్డే పేరిట ఉన్న రికార్డును పుజారా బద్దలు కొట్టాడు. 1964-65 సీజన్‌లో బోర్డే 28 ఇన్నింగ్స్‌ల్లో 64.16 సగటుతో 1604 పరుగులు చేశాడు.

మూడో ఓపెనర్‌గా మురళీ విజయ్‌ రికార్డు

మూడో ఓపెనర్‌గా మురళీ విజయ్‌ రికార్డు

టెస్టుల్లో తొమ్మిదో సెంచరీతో ఈ ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత మూడో ఓపెనర్‌గా మురళీ విజయ్‌ రికార్డు కెక్కాడు. కాగా, ఉప్పల్‌ స్టేడియంలో వరుసగా రెండో సెంచరీ. గవాస్కర్‌ (33), సెహ్వాగ్‌ (22) అతనికంటే ముందున్నారు.

ఐదు సెంచరీ భాగస్వామ్యం

ఐదు సెంచరీ భాగస్వామ్యం

హోం సీజన్‌లో మురళీ విజయ్‌, ఛటేశ్వర్ పుజారాల జోడీ ఐదు సెంచరీ భాగస్వామ్యాలు నెల కొల్పారు. దీంతో 1948-49 సీజన్‌లో విజయ్‌ హజారె, రూసీ మోడీ నెల కొల్పిన నాలుగు సెంచరీ భాగస్వా మ్యాల రికార్డుని అధిగమించారు. ఒక భారత జోడీకి ఇదే అత్యధికం.

సెహ్వాగ్ రికార్డుని అధిగమించిన కోహ్లీ

సెహ్వాగ్ రికార్డుని అధిగమించిన కోహ్లీ

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. ఒక సీజన్లో భారత గడ్డపై అత్యధిక స్కోరు చేసిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (1105) పేరిట ఉన్న రికార్డుని అధిగమించాడు. బంగ్లా టెస్టులో 144 పరుగులు చేయడంతో కోహ్లీ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 2016/17 సీజన్‌లో కోహ్లీ 1075 పరుగులు చేశాడు.

మరో 61 పరుగుల దూరంలో నిలిచిన పుజారా-విజయ్ జోడీ

మరో 61 పరుగుల దూరంలో నిలిచిన పుజారా-విజయ్ జోడీ

మరో 61 పరుగులు చేస్తే హోం సీజన్‌లో అత్యధిక పరుగు లు సాధించిన భారత జోడీగా విజయ్‌-పుజారా రికార్డు నెలకొల్పనున్నారు. 9 టెస్టుల్లో 852 పరుగులు జోడించిన ఈ ఇద్దరూ 1979/80 సీజన్‌లో 18 మ్యాచ్‌లాడి గవాస్కర్‌, చౌహాన్‌ నెలకొల్పిన 913 పరుగుల భాగస్వామ్యానికి చేరు వయ్యారు.

కెప్టెన్‌గా కోహ్లీ పరుగులు 2222

కెప్టెన్‌గా కోహ్లీ పరుగులు 2222

టెస్టుల్లో కెప్టెన్‌గా కోహ్లీ సాధించిన పరుగులు 2222. ఇప్పటివరకు కోహ్లీ 16 సెంచరీలు సాధించాడు. ఉప్పల్‌ స్టేడియంలో అతడికి ఇది మొదటి సెంచరీ. బంగ్లాదేశ్‌పై విరాట్‌ కోహ్లికి ఇది తొలి సెంచరీ. యావరేజి పరంగా చూస్తే మిగిలిన భారత కెప్టెన్లందరిలోనూ కోహ్లీ (67.33)నే అగ్రస్థానంలో ఉన్నాడు.

అజహరుద్దీన్‌తో సమానమైన కోహ్లీ

అజహరుద్దీన్‌తో సమానమైన కోహ్లీ

టెస్టుల్లో కెప్టెన్‌గా కోహ్లీ 9 సెంచరీలు సాధించాడు. కెప్టెన్‌గా ఎక్కువ శతకాలు సాధించిన భారత ఆటగాళ్లలో కోహ్లీ అజహరుద్దీన్‌తో సమానంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో గావస్కర్‌ (11) ముందు స్ధానంలో నిలిచాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+