For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉప్పల్ టెస్టు: సందడి చేసిన హీరో అఖిల్, కేసీఆర్ మనవడు హిమాన్షు

ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో రెండో రోజైన శుక్రవారం టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులు నమోదు చేశారు. 

By Nageshwara Rao

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో రెండో రోజైన శుక్రవారం టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులు నమోదు చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ సాధించి చరిత్రను సృష్టిస్తే, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ వృద్ధిమాన్ సాహా అద్భుత సెంచరీని సాధించాడు.

దీంతో టీమిండియా 6 వికెట్లకు 687 పరుగుల భారీ స్కోరువద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నగరంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ కావడంతో ఈ టెస్టును వీక్షించేందుకు టాలీవుడ్ నటుడు అక్కినేని అఖిల్‌, తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు తన స్నేహితులతో కలిసి హాజరయ్యాడు.

కాగా, రెండో రోజైన శుక్రవారం కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌కు (204 పరుగులు, 246 బంతులు) ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో స్టేడియం మార్మోగింది. కోహ్లీ డబుల్ సెంచరీ చేసిన సమయంలో హిమాన్షు తన స్నేహితులతో కలిసి జాతీయ జెండాను ఊపుతూ కనిపించాడు.

రెండో రోజు స్టాటస్టికల్ హైలెట్స్:

మూడు వికెట్ల నష్టానికి 356 పరుగులు

మూడు వికెట్ల నష్టానికి 356 పరుగులు

టీమిండియా రెండో రోజు ఆటను మూడు వికెట్ల నష్టానికి 356 పరుగుల స్కోరువద్ద ఆరంభించింది. అప్పటికి కోహ్లీ 111, రహానే 45 పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలింగ్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ స్కోరుబోర్డును ముందుకు దూకించిన కోహ్లీ నాలుగో వికెట్‌కు 222 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 456 పరుగుల వద్ద రహానే అవుటయ్యాడు.

రహానే 11 ఫోర్ల సాయంతో 82 పరుగులు

రహానే 11 ఫోర్ల సాయంతో 82 పరుగులు

రహానే 133 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లతో 82 పరుగులు సాధించి తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లో మెహదీ హసన్ మీర్జా క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. మరో 39 పరుగుల తర్వాత కోహ్లీ వికెట్ కూడా పెవిలియన్‌కు చేరాడు. 24 ఫోర్లతో 204 పరుగులు చేసి, తైజుల్ ఇస్లాం బౌలింగ్‌లోనే ఎల్‌బిగా వెనుదిరిగాడు.

 తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ చరిత్ర

తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ చరిత్ర

తద్వారా కోహ్లీ వరుసగా నాలుగు టెస్టు సిరీస్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. అంతక ముందు వెస్టిండిస్‌పై 200, న్యూజిలాండ్‌పై 211, ఇంగ్లాండ్‌పై 235 ఇలా వరుసగా మూడు డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీకి ఇది నాలుగో డబుల్ సెంచరీ. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజాలను కోహ్లీ అధిగమించాడు.

మూడు సిరిస్‌లలో మూడు డబుల్ సెంచరీలు

మూడు సిరిస్‌లలో మూడు డబుల్ సెంచరీలు

డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే వరుసగా మూడు సిరిస్‌లలో మూడు డబుల్ సెంచరీలను సాధించారు. అనంతరం రవిచంద్రన్ అశ్విన్ 45 బంతుల్లో 34 పరుగులు చేసి, మెహదీ హసన్ మీర్జా బౌలింగ్‌లో సౌమ్య సర్కార్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం సాహా, రవీంద్ర జడేజా మరో వికెట్ కూలకుండా స్కోరును 166 ఓవర్లలో 687 పరుగులకు చేర్చగా, ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు.

టెస్టుల్లో సాహా రెండో సెంచరీ

టెస్టుల్లో సాహా రెండో సెంచరీ

సాహా 155 బంతులు ఎదుర్కొని, 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 106 పరుగులు సాధించి టెస్టుల్లో రెండో సెంచరీని నమోదు చేశాడు. అతనితోపాటు మరో నాటౌట్ బ్యాట్స్‌మన్ జడేజా 78 బంతుల్లో 60 పరుగులు చేశాడు. తైజుల్ ఇస్లాం 156 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టగా, మెహదీ హసన్ మీర్జాకు రెండు వికెట్లు లభించాయి.

భారత ఆటగాళ్లు రికార్డు

భారత ఆటగాళ్లు రికార్డు

కాగా, ఈ టెస్టులో భారత్ తరఫున మూడు వరుస టెస్టుల్లో కనీసం ఒక బ్యాట్స్‌మన్ రెండు వందలు లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించారు. ఈ టెస్టులో కోహ్లీ 204 పరుగులతో విజృంభించాడు. కాగా, రహానేతో కలిసి కోహ్లీ మూడోసారి డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. వీరిద్దరూ ఈమూడు డబుల్ సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్‌ను నాలుగో వికెట్‌కే సాధించడం గమనార్హం.

టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన

టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన

ఈ టెస్టులో టీమిండియా ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. బంగ్లా టెస్టులో టీమిండియా ఇప్పటి వరకు సాధించని రికార్డులను సృష్టించింది. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 80 పరుగులు చేయడంతో టీమిండియా ఇప్పటివరకు సాధించని ఓ రికార్డుని సొంతం చేసుకుంది. ఒక జట్టులోని టాప్ 7 బ్యాట్స్‌మెన్లలో ఐదుగురు ఆటగాళ్లు 80కి పైగా పరుగులు చేయడం ఇది ఏడోసారి. ఇదిలా ఉంటే టీమిండియా మాత్రం ఈ ఘనతను సాధించడం ఇదే తొలిసారి.

టీమిండియాకు అరుదైన రికార్డు

టీమిండియాకు అరుదైన రికార్డు

భారత జట్టుకు అరుదైన రికార్డు దక్కింది. వరుసగా మూడు టెస్టుల్లో ఆరు వందలకుపైగా పరుగులు సాధించిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్‌తో ముంబైలో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 631 పరుగులు చేసిన భారత్ ఆ మ్యాచ్‌ని ఇన్నింగ్స్‌ను తేడాతో గెల్చుకుంది. ఆ వెంటనే చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లకు 759 పరుగులు సాధించింది.

75 పరుగుల తేడాతో భారత్ విజయం

75 పరుగుల తేడాతో భారత్ విజయం

ఆ టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 687 పరుగులు చేసింది. వరుసగా మూడు టెస్టుల్లో ఆరు వందలకు మించి స్కోరును నమోదు చేసిన ఒకే ఒక జట్టుగా రికార్డు సృష్టించింది. టెస్టుల్లో భారత్ సాధించిన అత్యధిక స్కోర్లలో 6 వికెట్లకు 687 (డిక్లేర్డ్) ఐదో స్థానంలో నిలిచింది.

చెన్నై టెస్టులో ఏడు వికెట్లకు 759 పరుగులు

చెన్నై టెస్టులో ఏడు వికెట్లకు 759 పరుగులు

ఇంగ్లాండ్‌తో జరిగిన చెన్నై టెస్టులో ఏడు వికెట్లకు 759 పరుగులు సాధించింది. 2009లో శ్రీలంకపై ముంబై టెస్టులో తొమ్మిది వికెట్లకు 726 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 2010లో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్టులో 707 పరుగులు సాధించింది. 2004లో ఆస్ట్రేలియాపై సిడ్నీ టెస్టులో 7 వికెట్లకు 705 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+