
షెడ్యూల్ ప్రకారమే ఢిల్లీ టీ20:
గురువారం గంగూలీ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విలేకరి ఢిల్లీలో టీ20 మ్యాచ్ జరుగుతుందా? అని ప్రశ్నించగా.. 'అవును.. కచ్చితంగా జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారమే ఢిల్లీ టీ20 మ్యాచ్ ఉంటుంది' అని సమాధానం ఇచ్చారు. గంగూలీ వివరణతో ఢిల్లీ టీ20 మ్యాచ్‌పై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.

వేదికను మార్చాలని గంగూలీకి లేఖ:
ప్రస్తుతం డిల్లీలో వాయు కాలుష్య స్థాయి మరింత పెరిగి గాలి నాణ్యత పూర్తిగా క్షీణించింది. అయితే మ్యాచ్‌కు ఇంకా మూడు రోజుల సమయం ఉంది కాబట్టి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. బుధవారం గాలి నాణ్యత ప్రమాద స్థాయికి పడిపోయిందని ఢిల్లీ పర్యావరణ అధికారులు తెలిపారు. ఆటగాళ్లు ప్రమాద బారిన పడకుండా ఢిల్లీ వేదికను మార్చాలని గంగూలీకి ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే.

మ్యాచ్ కంటే కాలుష్య సమస్యే తీవ్రమైనది:
మ్యాచ్ నిర్వహణ కంటే ఢిల్లీ కాలుష్య సమస్య తీవ్రమైనదని బుధవారం భారత మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ అన్నారు. 'మ్యాచ్ చాలా చిన్న విషయం. డిల్లీలో పిల్లల నుంచి పెద్దల వరకు కాలుష్యంతో బాధపడుతున్నారు. గతంతో పోలిస్తే కాలుష్య సమస్య తీవ్రత కొంత మేర తగ్గింది. డిల్లీ ప్రజల కృషితోనే ఇది సాధ్యమైంది. మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే విషయంపై చింతించట్లేదు. మ్యాచ్‌ను నిర్వహించాలని కోరుకుంటున్నా. ఆటగాళ్లు మంచి వాతావరణంలో మ్యాచ్‌ను ఆడాలని భావిస్తారు. ఇక్కడ కాలుష్య సమస్య అధికంగా ఉంటే మ్యాచ్‌ను ప్రత్యామ్నాయ వేదికగా నిర్వహించాలి' అని గంభీర్ పేర్కొన్నారు.

చర్యలు తీసుకుంటున్నాం:
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఇక్కడ క్రికెట్ మ్యాచ్‌లు జరగడం నేను చూశా. క్రికెట్‌కు కాలుష్యం అడ్డకింగా మారకూడదు' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications
