న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh: గంగూలీతో కోహ్లీ, రోహిత్ భేటీ.. దేశ క్రికెట్ రోడ్‌మ్యాప్‌పై చర్చ!!

Ganguly Discusses Roadmap For Indian Cricket With Kohli,Rohit || Oneindia Telugu
India vs Bangladesh: Sourav Ganguly meets Virat Kohli, Rohit Sharma to discuss roadmap

ముంబై: బీసీసీఐ కొత్త బాస్ సౌరవ్ గంగూలీని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు గురువారం కలిశారు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లకు జట్టు ఎంపిక సందర్భంగా భేటీ అయ్యారు. ఈ భేటీకి కార్యదర్శి జై షా, సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ హాజరయ్యారు. అయితే భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం భేటీకి హాజరుకాలేదు.

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో సాత్విక్-చిరాగ్ సంచలనం.. క్వార్టర్స్‌లో సింధు, సైనాఫ్రెంచ్‌ ఓపెన్‌లో సాత్విక్-చిరాగ్ సంచలనం.. క్వార్టర్స్‌లో సింధు, సైనా

ధోనీ భవితవ్యంపై చర్చ:

ధోనీ భవితవ్యంపై చర్చ:

ముంబై బీసీసీఐ కార్యాలంలో అధ్యక్షుడు గంగూలీ సమక్షంలో గురువారం తొలిసారి అధికారిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దేశ క్రికెట్ రోడ్‌మ్యాప్ గురించి అందరూ చర్చించారు. ఇక సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ భవితవ్యంపై చర్చకు వచ్చినా.. ఎవరూ మాట్లాడలేదని సమాచారం తెలిసింది. యువ ఆటగాళ్ల గురించి కూడా చర్చలు జరిగాయట. టీ20 ప్రపంచకప్‌ కోసం మంచి జట్టును ఇప్పటి నుండే తయారుచేయాలని నిర్ణయించారట.

గంగూలీ సలహాలు, సూచనలు:

గంగూలీ సలహాలు, సూచనలు:

'భారత కెప్టెన్, వైస్ కెప్టెన్‌లను అధ్యక్షుడు, కార్యదర్శి కలువాలనుకున్నారు. దేశ క్రికెట్ రోడ్‌మ్యాప్‌నకు సంబంధించి చర్చ జరిగింది. బీసీసీఐ అధ్యక్ష హోదాలో గంగూలీ సలహాలు, సూచనలు చేశారు. కెప్టెన్ కోహ్లీ గంగూలీతో మాట్లాడాడు' అని సమావేశం తర్వాత బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో షేర్ చేసింది.

రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశాం:

రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశాం:

ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. 'ఒక విషయం చెప్పగలను. టీ20 ప్రపంచకప్ కంటే ముందు ఎక్కువ మంది యువకులకు అవకాశాలిస్తాం. ఆటగాళ్లు నిరూపించుకునేందుకు ప్రోత్సహిస్తాం. రిషభ్ పంత్ బాగానే ఆడుతున్నా.. సంజూ శాంసన్‌కు చోటిచ్చాం. దీన్ని బట్టే మా ఆలోచనా విధానం అందరికి అర్థమై ఉంటుంది. ప్రపంచకప్ కోసం ఓ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశాం. ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతాం' అని అన్నారు.

రోహిత్‌ శర్మకు టీ20 కెప్టెన్సీ:

రోహిత్‌ శర్మకు టీ20 కెప్టెన్సీ:

సమావేశం అనంతరం బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే సిరీస్‌లకు జట్ల ఎంపిక జరిగింది. విరామం లేకుండా వరుస సిరీస్‌లు ఆడుతున్న విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలెక్షన్ కమిటీ.. రోహిత్‌ శర్మకు టీ20ల కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఆల్‌రౌండర్ శివమ్ దూబే తొలిసారిగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. నాలుగేండ్ల తర్వాత జట్టులో యువ క్రికెటర్ సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. పొట్టి సిరీస్ నుంచి ఆల్‌రౌండర్ జడేజాకు విశ్రాంతినివ్వగా.. యుజువేంద్ర చాహల్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. టీ20లలో మార్పులు చేసినా.. టెస్టులకు మాత్రం సఫారీలను క్లీన్‌స్వీప్ చేసిన జట్టునే ఎంపిక చేశారు.

Story first published: Friday, October 25, 2019, 9:16 [IST]
Other articles published on Oct 25, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X