Ishant asks shami: నీలాగే బౌలింగ్ చేస్తున్నా వికెట్లు దక్కడం లేదు.. ఇంతకీ నీ రహస్యమేంటో చెప్పు!!

ఇండోర్: ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ రెండో ద్విశతకం బాదగా.. బంతితో పేసర్ మొహమ్మద్ షమీ మాయ చేసాడు. షమీ తొలి ఇన్నింగ్స్‌లో 3/27, రెండో ఇన్నింగ్స్‌లో 4/31 గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 7 వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

నీ బౌలింగ్ రహస్యమేంటి
మ్యాచ్ అనంతరం షమీ, ఇషాంత్, ఉమేశ్ మధ్య ఓ సరదా సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా షమీని ఇషాంత్ ప్రశ్నించాడు. 'ని బౌలింగ్‌లో బంతి ఎప్పుడు ప్యాడ్‌కు తగిలినా ఎల్బీడబ్ల్యూ అవుతోంది. పుల్ చేయబోతే క్యాచ్ అవుట్ అవుతున్నారు. మేం మాత్రం బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేయలేక అలసిపోతున్నాం. మేమూ నీలాగే బౌలింగ్ చేస్తున్నా వికెట్లు దక్కడం లేదు. నీ బంతి సరిగ్గా ప్యాడ్‌లకు తగిలితే.. మా బంతి పైనుంచి వెళ్లిపోతోంది. ఇంతకీ నీ రహస్యమేంటో చెప్పు' అని అడిగాడు.
బిర్యానీ, కబాబ్‌లు కాదు
ఇషాంత్ ప్రశ్నకు షమీ సమాధానం ఇచ్చాడు. 'దానికి కారణం బిర్యానీ, కబాబ్‌లు అని అందరూ అంటుంటారు. కానీ.. అవిమాత్రమే సరిపోదు. మీరు కూడా బాగా బౌలింగ్ చేయడం వల్లే నాపై ఒత్తిడి తక్కువగా ఉంటోంది. స్వేచ్ఛగా బౌలింగ్ చేస్తున్నా. అదృష్టం కూడా కలిసి వస్తోంది. ఏకాగ్రతతో ఒకే లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ బాగా పడుతోందని అనిపించినప్పుడు దానినే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నా. దాంతోనే వికెట్లు వస్తున్నాయి' అని షమీ చెప్పాడు.

షమీ పరుగు చిరుత వేటను తలపిస్తోంది
షమీ అద్భుత ప్రదర్శనపై ప్రస్తుతం ప్రశంసలు కురుస్తున్నాయి. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ కూడా షమీని ఆకాశానికెత్తాడు. 'షమీ బంతి విసిరేందుకు పరుగెడుతుంటే స్పైడర్ కెమెరాలోంచి ఆ షాట్ తీస్తే చూడ్డానికి ఎంతో బాగుతుంటుంది. వేట కోసం చిరుతపులి పరుగెడుతున్నట్టు అనిపిస్తుంది. షమీ సీమ్, మణికట్టు పొజిషన్ చాలా బాగుంది. బంతిని రెండు వైపులా స్వింగ్ చేసేందుకు చేతి వేళ్లను వినియోగిస్తున్న విధానం అద్భుతం. ఈ నైపుణ్యం కోసం అతడెంతో సాధన చేశాడు' అని గావస్కర్ అన్నారు.

ఈ సీజన్‌లో 68 వికెట్లు
29 ఏళ్ల షమీ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 68 వికెట్లు (అన్ని ఫార్మాట్లలో) తీసాడు. ఆసీస్ పేసర్ పాట్ కమ్మిన్స్ మాత్రమే ఈ సంవత్సరం ఎక్కువ వికెట్లు (83) తీసాడు. ద్వితీయ స్థానంలో షమీ ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో తొలి 23 ఓవర్ల వరకు స్పిన్నర్ బౌలింగ్ చేయకపోవడం విశేషం. 2001 తర్వాత స్వదేశంలో రెండో ఇన్నింగ్స్‌లో ఇంత సుదీర్ఘంగా పేసర్లు బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications