
జట్టు కోసం ఎక్కడైనా ఆడుతా:
బంగ్లాతో సిరీస్‌కు ఎంపికయిన సంజూ శాంసన్ మాట్లాడుతూ... 'నేను చాలా సంతోషంగా ఉన్నా. ప్రపంచంలోనే అత్యుత్తమమైన భారత జట్టులోకి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. జట్టు అవసరాల కోసం టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఎక్కడైనా ఆడుతా. నా దేశం కోసం ప్రపంచకప్‌లో ఆడడం, కప్ గెలవడమే నా కల. అయితే ఇది ఏ సంవత్సరంలో జరుగుతుందో నాకు తెలియదు' అని అన్నాడు.

వైఫల్యాలే నేర్పించాయి:
'కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాను. సురక్షితమైన కెరీర్ ఉంటే నేర్చుకునేందుకు అవకాశం ఉండదు. ఎక్కువ సార్లు విఫలమైతే విజయవంతం ఎలా అవ్వాలో తెలుస్తుంది. నా జీవితంలో ఎన్నోసార్లు విఫలమయి నిలబడ్డా. నా కెరీర్ పట్ల బాధలేదు. అయితే నాపై ఎక్కువగానే అంచనాలున్నాయి. ముందుకన్నా ఇప్పుడు బాగా ఆడాలి. టీమిండియాకు ముందుగానే ఎంపికవ్వాల్సింది. ఆలస్యంగానైనా.. నాకు సమయం వస్తుందనుకున్నా. నా గడ్డు కాలాన్నీ ఆస్వాదించా' అని శాంసన్ తెలిపాడు.

పరిపూర్ణ బ్యాట్స్‌మన్ అవ్వాలని ప్రయత్నించలేదు:
'ఐదేళ్లలో మానసికంగా, సాంకేతికంగా నాలో ఎన్నో మార్పులు వచ్చాయి. నన్ను, నా ఆటను అర్థం చేసుకున్నా. నా బలాలపై దృష్టి మరింత పెట్టా. ఎప్పుడూ పరిపూర్ణ బ్యాట్స్‌మన్ అవ్వాలని ప్రయత్నించలేదు. ఎందుకంటే.. పరిపూర్ణులు ఎవరూ ఉండరు. ఇప్పుడన్నీ తేలిగ్గా స్వీకరిస్తూ ఆటను ఆస్వాదిస్తున్నా. ఈ క్రమంలోనే పరుగులు చేసి జట్టులోకి వచ్చా' అని శాంసన్ పేర్కొన్నాడు.

ఫిట్‌నెస్‌పై శ్రమించా:
'మూడేళ్లుగా నా ఫిట్‌నెస్‌పై శ్రమించా. ఫిజియోలు, శిక్షకులు ఎన్నో సలహాలు ఇచ్చారు. ఒక పద్ధతిలో కసరత్తులు చేశా. 2018 ఐపీఎల్ తర్వాత గాయపడ్డా. యోయో టెస్టుకు ముందు కోలుకోలేదు. ఈ విషయాన్ని ఫిజియోకు చెప్పలేదు. యోయో పాస్ అవుతాననే అనుకున్నా. కానీ కాలేదు. ఫిట్‌నెస్ నా విషయంలో సమస్యే కాదు' అని కేరళ క్రికెటర్ వెల్లడించాడు.


Click it and Unblock the Notifications
