బంగ్లా సిరిస్‌కు సంజూ శాంసన్ ఎంపిక: రిషబ్ పంత్ కెరీర్‌ను ప్రమాదంలో పడేయనుందా?

హైదరాబాద్: పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రిషబ్ పంత్‌కు బ్యాకప్‌గా మరో వికెట్‌కీపర్‌ను తయారు చేసేందుకు సెలక్టర్లు బంగ్లాదేశ్ సిరిస్‌ను తమకు అనుకూలంగా మరల్చుకున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రి సింగ్ ధోని వారసుడిగా రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు.
రిషబ్ పంత్ చాలా ప్రతిభావంతుడు. అలవోకగా సిక్సర్లు బాదగలడు. ఇదంతా కూడా వరల్డ్‌కప్‌కు ముందుమాట. వరల్డ్‌కప్ ముందు వరకు తుది జట్టలో రిషభ్ పంత్‌కు చోటివ్వకపోతే మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేశారు. అయితే,
వరల్డ్‌కప్ అనంతరం రిషబ్ పంత్ విషయంలో చాలా మార్పు వచ్చింది.

పంత్‌కు బ్యాకప్ కీపర్‌గా
పంత్ స్థానంలో మరొకరిని ఎంపిక చేయాలని వారే కోరుతున్నారు. ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ గాయపడటంతో అనూహ్యంగా చోటు దక్కించుకున్న పంత్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఫరవాలేదనిపించాడు. సెమీస్‌లో కివీస్ చేతిలో ఓడటం.. ఆ తర్వాత కోహ్లీసేన విండిస్ పర్యటనకు వెళ్లింది.

పంత్ ప్రదర్శన తీవ్ర విమర్శలు
ఈ పర్యటనలో పంత్ ప్రదర్శన తీవ్ర విమర్శల పాలైంది. టీమిండియాకు ఎప్పటి నుంచో సమస్యగా మారిన NO.4 స్థానంలో పంత్‌ను ఆడిస్తే పేలవ షాట్లకు వికెట్ సమర్పించుకుని విమర్శల పాలయ్యాడు. కీలక సమయంలో జట్టుకు అండగా నిలవాల్సిందిపోయి అనవసరపు షాట్లకు ప్రయత్నించి పెవిలియన్‌కు చేరుకున్నాడు.

తప్పుల నుంచి నేర్చుకుంటాడని
యువ ఆటగాడు కావడం... అద్భుత ప్రదర్శన దాగి ఉండటంతో తప్పుల నుంచి నేర్చుకుంటాడని అటు జట్టు మేనేజ్‌మెంట్‌తో పాటు ఇటు కెప్టెన్, కోచ్ సైతం పంత్‌ను వెనుకేసుకొచ్చారు. అయితే, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో సైతం పంత్ ఆటతీరులో ఏమాత్రం మార్పు రాలేదు.

వృద్ధిమాన్ సాహాకు చోటు
దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ నుంచి రిషబ్ పంత్‌ను తప్పించి అతడి స్థానంలో వృద్ధిమాన్ సాహాకు చోటు కల్పించారు. సాహా సైతం తనకు అందివచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడంతో మిగతా రెండు టెస్టులకు అతడినే కొనసాగించారు. దీంతో టెస్టుల్లో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ స్థానం సందిగ్ధంలో పడింది.

సాహాను కాదని రిషబ్ పంత్
టెస్టుల్లో వృద్దీమాన్ సాహాను కాదని రిషబ్ పంత్‌కు చోటిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇదే సమయంలో విజయ్ హజారే టోర్నీలో సంజూ శాంసన్ 125 స్ట్రయిక్ రేట్‌తో 410 పరుగులు చేశాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ సాధించాడు. దేశవాళీ క్రికెట్‌లో యువ బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్ సత్తా చాటడం కూడా పంత్ కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది.

సంజు శాంసన్ ఎంపిక
బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు జట్టుని ఎంపిక చేసేందుకు గాను ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ గురువారం సమావేశమైంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌తో మూడు టీ20ల సిరిస్‌కు కేరళ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్‌కు సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో సంజు శాంసన్ నుంచి పంత్‌కు గట్టి పోటి తప్పేలా లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications