లంచ్‌కు ముందు... లంచ్ తర్వాత: స్లిప్‍లో రోహిత్ శర్మ సూపర్ క్యాచ్ (వీడియో)

హైదరాబాద్: లంచ్ విరామంలో టీమిండియా ఓపెనర్ చేసిన స్లిప్ క్యాచ్ ప్రాక్టీస్‌కు బంగ్లాదేశ్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆటలో భాగంగా ముష్ఫికర్ రహీమ్ ఇచ్చిన క్యాచ్‌ను రెండో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న రోహిత్ శర్మ జారవిడిచాడు.
మహ్మద్ షమీ బౌలింగ్‌లో బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతిని నేరుగా రోహిత్ శర్మ చేతిలోకి వచ్చినప్పటికీ దానిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో మైదానంలోనే అసహనం వ్యక్తం చేసిన రోహిత్ శర్మ తాను క్యాచ్‌ని వదిలేసిన విషయాన్ని సీరియస్‌గా తీసుకుని లంచ్ విరామంలో అదే తరహా స్లిప్ క్యాచ్‌లను ప్రాక్టీస్ చేశాడు.

స్లిప్‌లో క్యాచ్‌లు నేలపాలు కాకుండా
ఈ క్రమంలో స్లిప్‌లో క్యాచ్‌లు నేలపాలు కాకుండా ఏ విధంగా రియాక్ట్ కావాలో ఓ అంచనాకు వచ్చాడు. లంచ్ విరామం అనంతరం షమీ వేసిన ఓవర్‌లో మహ్మదుల్లా ఇచ్చిన క్యాచ్‌ను అదే స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఏ మాత్రం తడబాటు లేకుండా అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

రోహిత్ అనున్నాడంటే అంతే
దీంతో "దటీజ్ రోహిత్.. ఫోకస్ పెట్టాడంటే అంతే" అంటూ రోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం 63 ఓవర్లకు గాను బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. క్రీజులో ముష్ఫికర్ రహీమ్(59), తైజుల్ ఇస్లాం(6) పరుగులతో ఉన్నారు. బంగ్లాదేశ్ ఇంకా 140 పరుగుల వెనుకంజలో ఉంది.

మరో మూడు వికెట్లు అవసరం
మరోవైపు టీమిండియా విజయం సాధించాలంటే మరో మూడు వికెట్లు అవసరం. ఏడో వికెట్‌గా మెహిది హసన్ ఔటయ్యాడు. కాగా, నాలుగు పరుగుల వద్ద రోహిత్ రూపంలో లైఫ్ లభించిన ముష్ఫికర్ రహీమ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత బౌలర్లలో షమీకి మూడు వికెట్లు దక్కగా... ఉమేశ్ యాదవ్‌కి రెండు... రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మలకు తలో వికెట్ లభించింది.

తొలి ఇన్నింగ్స్‌లో 150కే ఆలౌట్
ఇండోర్ వేదికగా గురువారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలింది. భారత్ రెండో రోజు 493/6 పరుగులు చేయగా, తొలి ఇన్నింగ్స్‌లో 343 పరుగుల ఆధిక్యం లభించింది. మయాంక్ అగర్వాల్ (243), రహానే (86), రవీంద్ర జడేజా (60 నాటౌట్) రాణించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications