For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మేం ఇలాగే మంచి ప్రదర్శన కొనసాగిస్తే.. సెలక్టర్లకు, కోహ్లీకి పెద్ద తలనొప్పే: రోహిత్

India vs Bangladesh 2019,3rd T20I : Rohit Sharma Funny Answer On Kohli And Selectors || Oneindia
India vs Bangladesh: Rohit Sharma Said If We Keep Performing Like This Headache For Virat Kohli, Selectors

నాగ్‌పూర్‌: మూడో టీ20లో ఆడినట్టే మేం మంచి ప్రదర్శన కొనసాగిస్తే.. సెలక్టర్లకు, కెప్టెన్ విరాట్‌ కోహ్లీకి ఎంపిక ప్రక్రియ పెద్ద తలనొప్పిగా మారుతుంది అని తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మూడో టీ20లో భారత విజయానికి బౌలర్లే కారణం అని రోహిత్‌ పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో తొలి టీ20 కోల్పోయిన టీమిండియా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ట్రోఫీని 2-1తో కైవసం చేసుకుంది. మీడియం పేసర్‌ దీపక్‌ చాహర్‌ ప్రపంచ రికార్డు ప్రదర్శనతో భారత్‌కు సిరీస్‌ విజయాన్ని అందించాడు. టాపార్డర్‌తో పాటు లోయరార్డర్‌ పనిబట్టిన చాహర్‌ హ్యాట్రిక్‌ సహా ఆరు వికెట్లతో బంగ్లా బ్యాటింగ్‌ వెన్ను విరిచాడు.

బౌలర్లే మ్యాచ్ గెలిపించారు

బౌలర్లే మ్యాచ్ గెలిపించారు

మ్యాచ్‌ అనంతరం రోహిత్‌ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడుతూ...'బౌలర్లే మ్యాచ్ గెలిపించారు. మంచు ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆట మధ్యలో ఎంత కష్టంగా ఉంటుందో నాకు తెలుసు. ఒక దశలో బంగ్లాకు 8 ఓవర్లలో 70 పరుగులు అవసరమైనపుడు మాకు విజయం కష్టంగా మారింది. అయితే మా ఆటగాళ్లు బాధ్యత తీసుకొని మ్యాచును మా వైపుకు తెచ్చారు. భారత జెర్సీపై ఉన్న బ్యాడ్జ్‌ కోసమే మనం ఆడుతున్నామనే విషయాన్ని అందరికి గుర్తు చేశా. ఈ విజయం క్రెడిటంతా బౌలర్లకే. ముఖ్యంగా చాహర్ సూపర్' అని రోహిత్ అన్నాడు.

ప్రతిఒక్కరి నుంచి ఇదే ఆశిస్తున్నాం

ప్రతిఒక్కరి నుంచి ఇదే ఆశిస్తున్నాం

'కేఎల్ రాహుల్‌, శ్రేయాస్ అయ్యర్‌ బాగా బ్యాటింగ్ చేసారు. కీలక సమయంలో బాధ్యత తీసుకుని మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఆరంభంలో రాహుల్‌ బాగా ఆడితే, స్కోరును పెంచడంలో అయ్యర్‌ సక్సెస్‌ అయ్యాడు. ఇలా ప్రతీ ఒక్కరూ రాణించడం శుభ సూచికం. ప్రతిఒక్కరి నుంచి ఇదే ఆశిస్తున్నాం. ఆటగాళ్లు అందరూ బాధ్యత తీసుకున్నారు' అని రోహిత్ పేర్కొన్నాడు.

సెలక్టర్లకు, కోహ్లీకి తలనొప్పే

సెలక్టర్లకు, కోహ్లీకి తలనొప్పే

'టీ20 సిరీస్‌కు కొందరు ఆటగాళ్లు దూరమైనా.. తిరిగి జట్టులోకి వస్తారు. టీ20 ప్రపంచకప్‌ సమయానికి ఇంకా మ్యాచులు ఉన్నాయి. అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా ఫ్లయిట్ ఎక్కేలోపు అత్యుత్తమ జట్టును కనుక్కోవాలి. ఈరోజు ఆడినట్టే మేం మంచి ప్రదర్శన కొనసాగిస్తే.. సెలక్టర్లకు, విరాట్‌ కోహ్లీకి ఎంపిక ప్రక్రియ పెద్ద తలనొప్పిగా మారుతుంది' అని రోహిత్‌ నవ్వుతూ అన్నాడు.

నాల్గో స్థానంపై అయ్యర్‌ కన్ను

నాల్గో స్థానంపై అయ్యర్‌ కన్ను

ఈ సిరీస్‌లో యువ క్రికెటర్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ప్రధానంగా శివమ్‌ దూబే, దీపక్‌ చహర్‌లు రాణించి సిరీస్‌ను చేజిక్కించుకోవడంలో ముఖ్య భూమిక పోషించాడు. శ్రేయస్‌ అయ్యర్‌ కూడా సత్తా చాటి.. భారత జట్టు ఎప్పుట్నుంచో అన్వేషిస్తున్న నాల్గో స్థానంపై ఆశలు రేకెత్తిస్తున్నాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకుంటున్న కీపర్ రిషభ్‌ పంత్‌ మాత్రం నిరాశ పరుస్తూనే ఉన్నాడు.

సిరీస్‌ కైవసం

సిరీస్‌ కైవసం

మొదటగా శ్రేయస్‌ అయ్యర్‌ (62; 33 బంతుల్లో 3x4, 5x6), కేఎల్‌ రాహుల్‌ (52; 35 బంతుల్లో 7x4) మెరవడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లా 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. దీపక్‌ చాహర్‌, శివమ్‌ దూబె అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. టీమిండియా 30 పరుగులతో విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకుంది.

Story first published: Monday, November 11, 2019, 11:54 [IST]
Other articles published on Nov 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+