For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Bangladesh: రోహిత్ శర్మ ఫిట్, తొడ గాయంపై ఆందోళన వద్దు!

India vs Bangladesh 2019 : Rohit Sharma Cleared To Play First T20I After Injury || Oneindia Telugu
India vs Bangladesh: Rohit Sharma Cleared to Play First T20I After Injury Scare in Nets

హైదరాబాద్: భారత అభిమానులకు శుభవార్త. నెట్స్‌లో గాయపడిన ఓపెనర్ రోహిత్ శర్మ బంగ్లాదేశ్‌తో జరగనున్న తొలి టీ20కి అందుబాటులో ఉంటాడని బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుండగా.. ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్‌లలో పాల్గొంటున్నాయి.

కోచ్ విక్రమ్ రాథోడ్ సమక్షంలో

కోచ్ విక్రమ్ రాథోడ్ సమక్షంలో

శుక్రవారం బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ సమక్షంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేశారు. సెషన్‌ ప్రారంభమయిన కొద్ది నిమిషాలకే భారత నెట్ బౌలర్ నువాన్ సెనెవిరత్నే వేసిన బంతి రోహిత్ శర్మ కాలికి బలంగా తాకింది. నొప్పితో విలవిలలాడిన రోహిత్.. చేతి గ్లోవ్స్ తీసి ప్రాక్టీస్ నుండి బయటకి వెళ్ళిపోయాడు.

రాథోడ్, సెనెవిరత్నే ఆపడానికి ప్రయత్నం చేసినా

రాథోడ్, సెనెవిరత్నే ఆపడానికి ప్రయత్నం చేసినా

విక్రమ్ రాథోడ్, సెనెవిరత్నే ఆపడానికి ప్రయత్నం చేసినా రోహిత్ మైదానంలో ఉండలేదు. ఆ తర్వాత మళ్లీ ప్రాక్టిస్‌కు రాకపోవడంతో తొలి టీ20కి రోహిత్ అందుబాటులో ఉంటాడో లేదోనని సందేహాలు వెల్లువెత్తాయి. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

రోహిత్‌శర్మ ఎడమ తొడకు గాయం

రోహిత్‌శర్మ ఎడమ తొడకు గాయం

"నెట్స్‌లో బ్యాటింగ్ సాధన చేస్తుండగా రోహిత్‌శర్మ ఎడమ తొడకు గాయమైంది. పరీక్షించించిన వైద్యసిబ్బంది రోహిత్‌ ఫిట్‌గా ఉన్నాడని ధృవీకరించింది. తొలి టీ20కు అతడు అందుబాటులో ఉంటాడు" బీసీసీఐ పేర్కొంది. భారత పర్యటనలో బంగ్లాదేశ్‌ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.

ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి టీ20

ఆదివారం ఇరు జట్ల మధ్య తొలి టీ20

ఆదివారం ఇరు జట్ల మధ్య అరుణ్‌ జైట్లీ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్‌తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. గత కొంత కాలంగా తీరిక లేని క్రికెట్ ఆడుతున్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టీ20ల సిరీస్‌ నుండి విశ్రాంతి తీసుకున్నాడు. దీంతో వైస్ కెప్టెన్ రోహిత్‌ శర్మ తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.

Story first published: Saturday, November 2, 2019, 9:59 [IST]
Other articles published on Nov 2, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+