Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'మా బౌలింగ్‌ యూనిట్‌ను చూసి ఎంతో గర్వంగా ఫీలవుతున్నాం'

IND vs BAN,2nd Test : Ravi Shastri Revealed The Key Reason For Indian Bowlers Success || Oneindia
India vs Bangladesh: Ravi Shastri said Hunting in pack is key to Indias success

కోల్‌కతా: మా బౌలింగ్‌ యూనిట్‌ను చూసి డగౌట్లలో కూర్చొని ఉన్న మేము ఎంతో గర్వంగా ఫీలవుతున్నాం. ఇందుకోసం చాలా సమయం పట్టింది అని టీమిండియా హెడ్ కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. టెస్టు సిరీస్‌లో భారత పేసర్లు చెలరేగిపోవడంపై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఈడెన్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టు (తొలి డే/నైట్‌ టెస్టు)లో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది.

గర్వంగా ఫీలవుతున్నాం

గర్వంగా ఫీలవుతున్నాం

మ్యాచ్ అనంతరం రవిశాస్త్రి మాట్లాడుతూ... 'ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా మా పేసర్లు చెలరేగిపోతున్నారు. దాంతోనే ఈ విజయాలు వస్తున్నాయి. మా పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌ ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్‌ యూనిట్లలో ఒకటిగా ఎదగడం మంచి పరిణామం. మా బౌలింగ్‌ యూనిట్‌ను చూసి డగౌట్లలో కూర్చొని ఉన్న మేము ఎంతో గర్వంగా ఫీలవుతున్నాం. ఇందుకోసం చాలా సమయం పట్టింది' అని అన్నాడు.

పాఠాలు నేర్చుకున్నారు:

పాఠాలు నేర్చుకున్నారు:

'గత 15 నెలల నుంచి విదేశీ గడ్డపై చాలా క్రికెట్‌ ఆడాం. కొన్ని ఓటములు కూడా ఎదురయ్యాయి. ఆటలో అన్ని భాగమే. మా వాళ్లు చాలా పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడు అదే సత్ఫలితాల్ని ఇస్తుంది. పిచ్‌ పరిస్థితిని తొందరగా అర్థం చేసుకుంటున్నారు. పింక్‌ బాల్‌ టెస్టులో పిచ్‌ గతిని వెంటనే ఒడిసి పట్టుకున్నారు' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

 పేస్‌ యూనిట్‌ను పటిష్టం చేసుకోవాలి:

పేస్‌ యూనిట్‌ను పటిష్టం చేసుకోవాలి:

బంగ్లాదేశ్‌కు రవిశాస్త్రి ఒక సలహా ఇచ్చాడు. 'విదేశాల్లో విజయాలు సాధించాలంటే బౌలింగ్‌ యూనిట్‌ను పటిష్టం చేసుకోవాలి. బంగ్లా స్వదేశంలో తిరుగులేని జట్టు. కానీ.. విదేశీ పిచ్‌లపై రాణించాలంటే పటిష్టమైన పేస్‌ యూనిట్‌ను తయారు చేసుకోవాలి. భారత్‌ తరహా పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌తో విదేశీ మ్యాచ్‌లకు సిద్దం కావాలి. పేస్‌లో బలపడితే మరింత మెరుగవుతారు. ముందు పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌ పటిష్టం చేసుకోవడంపై దృష్టి సారించండి' అని రవిశాస్త్రి సూచించాడు.

 టెస్టుల్లో 12వ విజయం:

టెస్టుల్లో 12వ విజయం:

రెండో టెస్ట్ విజయంతో సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అంతకు ముందు జరిగిన టీ 20 సిరీస్‌ను రోహిత్ శర్మ సారథ్యంలో 2-1తో గెలిచింది. భారత్ వరుస విజయాలతో దూసుకుపోతుండడంతో కోహ్లీ మాంచి జోష్‌లో ఉన్నాడు. ఈ గెలుపుతో కోహ్లీసేన టెస్టుల్లో 12వ విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు, వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది.

Story first published: Monday, November 25, 2019, 9:47 [IST]
Other articles published on Nov 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+