డే/నైట్ టెస్టు: ఎడమచేత్తో బౌలింగ్, సనత్ జయసూర్యను అనుకరించిన అశ్విన్ (వీడియో)

హైదరాబాద్: రవిచంద్రన్ అశ్విన్... జట్టులో తన స్థానాన్ని కాపాడు కోవడం కోసం ఏమో తెలియదు కానీ, నిత్యం బంతితో విభిన్న వైవిధ్యాలను ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అశ్విన్ ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టేందుకు గాను సాంప్రదాయ ఆఫ్ స్పిన్‌పైనే ఆధారపడలేదు. తన కెరీర్ ప్రారంభంలో కరోమ్ బంతితో తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకున్నాడు.
గత ఐపీఎల్‌లో అశ్విన్ ఆఫ్ స్పిన్‌కు బదులుగా లెగ్ స్పిన్‌తో బంతులు సంధించి అభిమానులను ఆకట్టుకున్నాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా నవంబర్ 22 నుంచి కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా డే/నైట్ టెస్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ సరికొత్త వేరియషన్‌తో బరిలోకి దిగినున్నాడు.

డే/నైట్ టెస్టు కోసం
డే/నైట్ టెస్టు కోసం ఇప్పటికే ఈడెన్ గార్డెన్స్‌కు చేరుకున్న టీమిండియా ఫ్లడ్ లైట్ల వెలుగులోకి నెట్ ప్రాక్టీస్ చేస్తోంది. ఈ క్రమంలో అశ్విన్ పింక్ బాల్‌తో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అశ్విన్ జట్టు ప్రాక్టీస్ సెషన్లో ఎడమ చేతితో బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్యను అనుకరించే ప్రయత్నం చేశాడు.
ఎడమచేత్తో బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన అశ్విన్
సనత్ జయసూర్య ఏ విధంగానైతే ఎడమచేత్తో బౌలింగ్ చేస్తాడో అదే విధంగా రవిచంద్రన్ అశ్విన్ సైతం ప్రాక్టీస్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రాక్టీస్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ "పింక్ బాల్‌తో ఆడటం ఒక సవాల్. బంతికి చాలా లక్క ఉంటుంది. నేను పింక్ బంతితో ఒక్క బంతిని కూడా బౌల్ చేయలేదు" అని పేర్కొన్నాడు.

తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం
"పింక్ బాల్‌ను నేను చూశాను. దాని రంగు నారింజ లేదా గులాబీనా, ఇప్పటికీ కొన్నిసార్లు నాకు అర్థం కాలేదు" అని అశ్విన్ తెలిపాడు. ఇండోర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

మూడు వికెట్లతో చెలరేగిన అశ్విన్
మూడో రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బంగ్లాదేశ్ 69.2 ఓవర్లకు 213 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ నాలుగు వికెట్ల తీయగా, రవిచంద్రన్ అశ్విన్ మూడు, ఉమేశ్ యాదవ్ రెండు, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ లభించింది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications